AP Open School: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారందరినీ పాస్‌ చేస్తూ.

AP Open School Exams: కరోనా కారణంగా విద్యారంగంపై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే. విపరీతంగా పెరిగిన కేసుల కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం...

AP Open School: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారందరినీ పాస్‌ చేస్తూ.
Ap Open Schools

Updated on: Aug 03, 2021 | 4:49 PM

AP Open School Exams: కరోనా కారణంగా విద్యారంగంపై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే. విపరీతంగా పెరిగిన కేసుల కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం కూడా టెన్త్‌, ఇంటర్ పరీక్షలను రద్దు చేసింది. ఇంటర్నల్ మార్కులు, గతేడాది వచ్చిన మార్కులను ఆధారంగా తీసుకొని విద్యార్థులకు గ్రేడ్‌లను అందించారు. ఇక ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2021 విద్యా సంవత్సరానకి సంబంధించి ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

జులై నెలలో పరీక్షల కోసం ఫీజు చెల్లించి, నమోదు చేసుకున్న విద్యార్థులందరినీ పాస్‌ చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైపవర్‌ కమిటీ సిఫార్సుల మేరకు పరీక్షలను రద్దు చేస్తూ విద్యార్థులను ఉత్తీర్ణులగా ప్రకటించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న వారికి గ్రేడ్‌ పాయింట్లను ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటర్‌ విద్యార్థులకు పదో తరగతితో సాధించిన మార్కులతో 30 శాతం, ప్రీ ఫైనల్స్‌ పరీక్షలో వచ్చిన మార్కుల నుంచి 70 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. ఇక టెన్త్‌ విద్యార్థులను నేరుగా పాస్‌ చేయనున్నారు. ఈ వివరాలన్నింటినీ తెలుపుతూ.. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read: Viral Pic: ఈ ఫోటోలో ఏ జీబ్రా ముందుకు ఉంది.? మొత్తం ఎన్ని ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!

Bengaluru News: బెంగుళూరులో పోలీస్ కస్టడీలో కాంగో దేశస్తుడి మృతి..ఆఫ్రికన్ల నిరసన

China Rains: భారీ వరదలకు అతలాకుతలమవుతోన్న చైనా.. నీటిలో మునిగిపోయిన మెట్రో రైళ్లు.. అసలు కారణం అదేనా?