Andhra Pradesh: ప్రైవేటు యూనివర్సిటీల్లో రిజర్వేషన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు యూనివర్సిటీల్లోనూ కన్వీనర్ కోటా అమలు చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఈ మేరకు ప్రైవేటు వర్సిటీ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. ఆ ప్రకారం ఉత్తర్వులను కూడా జారీ చేసింది. కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం ప్రకారం.. ఇకపై ప్రైవేటు వర్సిటీల్లో 35 శాతం కన్వీనర్ కోటా కింద సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్న సీట్లకు రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అలాగే.. సీట్లు పొందిన విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట కూడా వర్తించనుంది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో కలిసి 60 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. దీని ప్రకారం.. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులకు సీట్లు లభించనున్నారు. ఇక మిగిలిన 40 శాతం సీట్లను అన్ రిజర్వుడు కేటగిరీలో కేటాయిస్తారు. విద్యావ్యవస్థలో మార్పు కోసం కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పుడు ప్రైవేట్ వర్సిటీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా ఎంతో విద్యార్థులకు మేలు చేకూరనుంది.
Also read:
Telangana: తెలంగాణ విద్యార్థులకు ముఖ్య గమనిక.. 14న టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష..
Andhra Pradesh: రైతుగా వచ్చిన సబ్ కలెక్టర్.. ఎరువుల షాపు యజమానులకు చుక్కలు చూపించారు..
Ambedkar Overseas Vidya Nidhi: విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్నారా? ఈ కీలక సమాచారం మీకోసమే..