
అమరావతి, డిసెంబర్ 4: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఇన్ ఏపీ ఎండోమెంట్స్ సబార్డినేట్ సర్వీస్ రాత పరీక్ష తేదీలు తాజాగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) విడుదల చేసింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఏపీ ఎండోమెంట్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎగ్జామ్ ఫిబ్రవరి 11వ తేదీన నిర్వహించనుంది. ఈ మేరకు ఎగ్జామ్ షెడ్యుల్‌లో పేర్కొంది. ఈ రాత పరీక్ష అబ్జెక్టివ్ విధానంలో డిగ్రీ స్థాయిలో ఉంటుంది. మొత్తం 2 పేపర్లకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2లో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టం నుంచి ప్రశ్నలు అడుగుతారు.
ఈ రెండింటిలో ఒక్కో పేపర్ నుంచి మొత్తం 150 ప్రశ్నలకు, 150 మార్కులు, 150 నిమిషాలు చొప్పున మొత్తం 300 మార్కలకు పరీక్షలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 చొప్పున నెగెటివ్ మార్కుల కోత విధిస్తారు. రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా కంప్యూటర్ ప్రొఫిఫియెన్సీ టెస్ట్‌కు షార్ట్‌లిస్ట్ చేస్తారు. కాగా ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 7 పోస్టుల భర్తీకి గత ఆగస్టులో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఏపీపీఎస్సీ ఎండోమెంట్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎగ్జామ్ 2025 షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 21 ఉద్యోగ నోటిపికేషన్లను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన రాత పరీక్షల తేదీలను తాజాగా ఏపీపీఎస్సీ విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. 2026 జనవరి 27 నుంచి 31 వరకు, ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు రాత పరీక్షలు ఆఫ్‌లైన్ విధానంలో జరగనున్నాయి. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఏపీపీఎస్సీ రాత పరీక్షల తేదీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.