AP 10th Class Syllabus: విద్యార్ధులకు అలర్ట్.. పదో తరగతి హిందీ సబ్జెక్టులో నాలుగు పాఠాలు తొలగించిన విద్యాశాఖ! కారణం ఇదే

|

Oct 02, 2024 | 4:07 PM

దోతరగతి హిందీ సబ్జెక్టులో సిలబస్‌ను తగ్గిస్తూ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) సిలబస్‌ను అమలు చేస్తున్నారు. దీంతో హిందీ సబ్జెక్టుకు సైతం ఎన్‌సీఈఆర్టీ పుస్తకాలనే వినియోగిస్తున్నారు. ఇందులో పాఠాలు ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నట్లు ఉపాధ్యాయులు అధికారుల..

AP 10th Class Syllabus: విద్యార్ధులకు అలర్ట్.. పదో తరగతి హిందీ సబ్జెక్టులో నాలుగు పాఠాలు తొలగించిన విద్యాశాఖ! కారణం ఇదే
AP 10th Class Syllabus
Follow us on

అమరావతి, అక్టోబర్ 2: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్‌ విద్యాశాఖలో పలు కీలక మార్పులు తీసుకొస్తుంది. ఇప్పటికే వంద పాఠశాలల్లో గత ప్రభుత్వం తీసుకొచ్చిన సీబీఎస్సీ విధానాన్ని కూటమి సర్కార్ రద్దు చేసింది. దీంతో ఈ ఏడాది ఆయా పాఠశాలల్లోని పదో తరగతి చదువుతున్న విద్యార్ధులందరినీ స్టేట్‌ సిలబస్‌కు మర్చుతున్నట్లు నిర్ణయం తీసుకుంది. వారంతా ఈసారి జరగబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో స్టేట్‌ సిలబస్‌ ప్రకారంగానే పరీక్షలు రాయనున్నారు. అయితే వచ్చే ఏడాది నుంచి సీబీఎస్సీ విధానం తీసుకొస్తామని విద్యాశాఖ చెబుతుంది. ఈ క్రమంలో స్టేట్‌ సిలబస్‌లోనూ పలు మార్పులు చేస్తుంది.

తాజాగా పదోతరగతి హిందీ సబ్జెక్టులో సిలబస్‌ను తగ్గిస్తూ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) సిలబస్‌ను అమలు చేస్తున్నారు. దీంతో హిందీ సబ్జెక్టుకు సైతం ఎన్‌సీఈఆర్టీ పుస్తకాలనే వినియోగిస్తున్నారు. ఇందులో పాఠాలు ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నట్లు ఉపాధ్యాయులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై దృష్టి సారించిన విద్యాశాఖ తాజగా నాలుగు పాఠాలను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. పద్యభాగంలో 7వ పాఠం, గద్యభాగంలో 11, 12 పాఠాలు, ఉపవాచకంలో మూడో పాఠాన్ని తొలగించారు. ఈ పాఠాలను విద్యార్ధులకు ఉపాధ్యాయులు బోధించాల్సిన అవసరం లేదని పేర్కొంది. పరీక్షల్లోనూ ఈ పాఠాల నుంచి ఎలాంటి ప్రశ్నలు ఇవ్వడం జరగదని స్పష్టం చేసింది.

కాగా సీబీఎస్‌ఈలో తొమ్మిదో తరగతి నుంచి ఐదు సబ్జెక్టుల విధానం ఉంటుంది. అక్కడ రెండో భాషగా హిందీ ఐచ్ఛికంగా తీసుకుంటారు. రాష్ట్రంలో ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ను వినియోగిస్తున్నా ఆరు సబ్జెక్టుల విధానం అమలు చేస్తున్నారు. దీంతో ఐచ్ఛికం లేకుండా హిందీ తప్పనిసరిగా చదవాల్సిన సబ్జెక్టుగా మారింది. మరోవైపు గణితంలోనూ సిలబస్‌ కొండంత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ సబ్జెక్టులోనూ కొన్ని పాఠాలు తొలగించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.