AP EAPCET 2023 Counselling: ఈఏపీసెట్‌ 2023 వెబ్‌ ఐచ్ఛికాల గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే

విద్యార్థులకు ప్రయోజనం చేకూరాలనే ఉద్ధేశ్యంతోనే గడువును మరో 8 రోజులు పొడిగించినట్లు ఆమె తెలిపారు. అలాగే ఇచ్చిన ఐచ్ఛికాలలో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోగోరే విద్యార్ధులకు ఆగస్టు 16వ తేదీన అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 23న సీట్ల కేటాయింపు ఉంటుందని, సీట్లు పొందిన వారు ఆగస్టు 31లోపు సంబంధిత కాలేజీలో చేరాలని, లేదంటే సీటు రద్దు అవుతుందని వెల్లడించారు. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి ఓ ప్రకటనలో తెలిపారు.

AP EAPCET 2023 Counselling: ఈఏపీసెట్‌ 2023 వెబ్‌ ఐచ్ఛికాల గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే
AP EAPCET 2023 Counselling

Updated on: Aug 10, 2023 | 4:06 PM

అమరావతి, ఆగస్టు 10: ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీసెట్‌ 2023 ఎంపీసీ స్ట్రీమ్‌ వెబ్‌ ఐచ్ఛికాల గడువును ఆగ‌స్టు 14 వరకు పొడిగిస్తూ ప్రకటన వెలువరించింది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు ప్రయోజనం చేకూరాలనే ఉద్ధేశ్యంతోనే గడువును పొడిగించినట్లు ఆమె తెలిపారు. అలాగే ఇచ్చిన ఐచ్ఛికాలలో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోగోరే విద్యార్ధులకు ఆగస్టు 16వ తేదీన అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 23న సీట్ల కేటాయింపు ఉంటుందని, సీట్లు పొందిన వారు ఆగస్టు 31లోపు సంబంధిత కాలేజీలో చేరాలని, లేదంటే సీటు రద్దు అవుతుందని వెల్లడించారు.

జవహర్‌ నవోదయ విద్యాలయ(జేఎన్‌వీ)లో ఆరో తరగతిలో ప్రవేశాలకు గడువు పొడిగింపు

దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 649 జవహర్‌ నవోదయ విద్యాలయ (జేఎన్‌వీ)లో 6వ తరగతిలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు నవోదయ విద్యాలయ సమితి ప్రకటించింది. ఈ మేరకు ఆగస్టు 17వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 24 జేఎన్‌వీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి.

2023-24 విద్యా సంవత్సరానికి నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు తప్పనిసరిగా ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మొత్తం సీట్లలో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించారు. మిగిలిన 25 శాతం సీట్లను పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థులకు కేటాయించనున్నారు. నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఏటా ఎంట్రన్స్‌ టెస్ట్‌ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ద్వారా విద్యార్థులకు ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రవేశాలు కల్పిస్తారు. అడ్మిషన్‌ పొందిన బాలబాలికలకు వేరువేరు వసతి సౌకర్యాలతోపాటు ఉచిత విద్యను అందిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.