AP DSC 2024 Notification: ఫిబ్రవరి 12న ఏపీ డీఎస్సీ- 2024 నోటిఫికేషన్‌ విడుదల.. డీఎస్సీకి ముందే టెట్‌ పరీక్ష

|

Feb 07, 2024 | 6:10 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నిరుద్యోగులకు జగన్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఫిబ్రవరి 12న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. జూన్ నాటికి పోస్టింగ్‌లు పూర్తి చేస్తామని, పదవీ విరమణ వయసు పెంపుతో ఖాళీల భర్తీ ప్రక్రియ ఆలస్యం అయిందని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ బుధవారం (ఫిబ్రవరి 7) తెలిపారు. ఈ నోటిఫికేషన్‌ కింద ఏప్రిల్ 31 వరకూ ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు..

AP DSC 2024 Notification: ఫిబ్రవరి 12న ఏపీ డీఎస్సీ- 2024 నోటిఫికేషన్‌ విడుదల.. డీఎస్సీకి ముందే టెట్‌ పరీక్ష
AP DSC 2024
Follow us on

అమరావతి, ఫిబ్రవరి 7: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నిరుద్యోగులకు జగన్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఫిబ్రవరి 12న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. జూన్ నాటికి పోస్టింగ్‌లు పూర్తి చేస్తామని, పదవీ విరమణ వయసు పెంపుతో ఖాళీల భర్తీ ప్రక్రియ ఆలస్యం అయిందని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ బుధవారం (ఫిబ్రవరి 7) తెలిపారు. ఈ నోటిఫికేషన్‌ కింద ఏప్రిల్ 31 వరకూ ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 2018 డీఎస్సీకి ఉన్న నిబంధనలు అన్నీ ఫాలో అవుతున్నామని అన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఫిబ్రవరి 22వ తేదీ వరకు కొనసాగుతుందని అన్నారు. ఫిబ్రవరి 21 వరకూ ఫీజు చెల్లింపునకు అవకాశం ఉంటుందని తెలిపారు.

మార్చి 5 నుంచి హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాం అని అన్నారు. ఈ సారి డీఎస్సీ పరీక్షలు ఆన్‌లైన్‌ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ముందే ప్రకటించింది. ఆ మేరకు మార్చి 15 నుంచి 30 వరకూ ఆన్‌లైన్ లో పరీక్షలు ఉంటాయని తెలిపారు. రోజుకు రెండు షిఫ్టుల ప్రకారం రెండు పూటలా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 2018 సిలబస్ ప్రకారమే పరీక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. డీఎస్సీ ఫలితాలు ఏప్రిల్ 7న విడుదల చేస్తామని వివరించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు cse.ap gov.in వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్ళుగా నిర్ణయించారు. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు మరో ఐదేళ్లు వయోపరిమితి పెంచినట్లు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సురేశ్ కుమార్ పేర్కొన్నారు.

డీఎస్సీకి ముందే టెట్‌ పరీక్ష.. : పాఠశాల విద్యాశాఖ

ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ టెట్‌ పరీక్షకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించారు. DSC కంటే ముందు TET పరీక్ష నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఫిబ్రవరి 8 న TET నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఇక అదే రోజు నుంచి దరఖాస్తులు స్వీకరణ కూడా ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 18 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి, ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకూ TET పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. మార్చి 14 న టెట్ ఫలితాలు విడుదల చేస్తారు. ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచి అంటే మార్చి 15 నుంచే డీఎస్సీ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం అవుతుంది. ఈ మేరక డీఎస్సీ, టెట్‌ పరీక్షల షెడ్యూల్‌ను డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సురేశ్ కుమార్ విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి

AP DSC 2024 Schedule

మరిన్ని విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.