Degree Admissions 2025: మొంథా ఎఫెక్ట్.. డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు! కొత్త తేదీలు ఇవే

AP Degree 3rd Phase Admission Revised Schedule 2025: డిగ్రీ మూడో విడత ప్రవేశాల కౌన్సెలింగ్‌ తేదీల్లో ఉన్నత విద్యామండలి సవరనలు చేసింది. రిజిస్ట్రేషన్లకు అక్టోబరు 29 వరకు గడువు ఇచ్చింది. ధ్రువపత్రాల అప్‌లోడింగ్‌ నవంబరు 1, పత్రాల పరిశీలన, వెబ్‌ ఐచ్ఛికాల నమోదుకు నవంబర్‌ 2 వరకు పొడిగించింది..

Degree Admissions 2025: మొంథా ఎఫెక్ట్.. డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు! కొత్త తేదీలు ఇవే
AP Degree Admissions

Updated on: Oct 28, 2025 | 3:58 PM

అమరావతి, అక్టోబర్ 28: మొంథా తుపాన్‌ కారణంగా డిగ్రీ మూడో విడత ప్రవేశాల కౌన్సెలింగ్‌ తేదీల్లో ఉన్నత విద్యామండలి సవరనలు చేసింది. రిజిస్ట్రేషన్లకు అక్టోబరు 29 వరకు గడువు ఇచ్చింది. ధ్రువపత్రాల అప్‌లోడింగ్‌ నవంబరు 1, పత్రాల పరిశీలన, వెబ్‌ ఐచ్ఛికాల నమోదుకు నవంబర్‌ 2 వరకు పొడిగించింది. 3న వెబ్‌ ఐచ్ఛికాల మార్పు, 4న సీట్ల కేటాయింపు చేయనున్నట్లు పేర్కొంది. సీట్లు పొందిన విద్యార్ధులు సంబంధిత కాలేజీల్లో నవంబరు 7వ తేదీలోపు చేరాల్సి ఉంటుంది.

ఈ స్కూళ్లలో ప్రాక్టికల్స్‌ పరీక్షా కేంద్రాలను కేటాయించండి..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వరంలోని మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకుల విద్యాలయాల్లో ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించేందుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ప్రాక్టికల్‌ పరీక్షలకు అవసరమైన సీసీ కెమెరాలు, ల్యాబ్‌లు ఇతర అన్ని వసతులు వీటిల్లో ఉన్నప్పటికీ.. వీటిని పరీక్ష కేంద్రాల జాబితా నుంచి తొలగించారు. వాటిని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ మోడల్‌ స్కూల్స్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (టీఎంఎస్‌టీఏ) విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాకమల్లు, సహాధ్యక్షుడు స్వామితోపాటు తదితరులు అక్టోబరు 27న సచివాలయంలో కార్యదర్శిని కలిసి వినతిపత్రం అందజేశారు. కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పబ్లిక్‌ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే.

తెలంగాణ పీజీ లాసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ షురూ..

తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సులో సీట్ల భర్తీకి అక్టోబరు 28 నుంచి పీజీ లాసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. ఈ మేరకు ప్రవేశాల కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఐ పాండురంగారెడ్డి తెలిపారు. అక్టోబరు 28 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ఉంటుందని తెలిపారు. ఇక అక్టోబరు 31 నుంచి నవంబరు 2 వరకు వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, నవంబరు 5న సీట్ల కేటాయింపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.