APCOB Recruitment: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కో – ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

|

Jul 28, 2021 | 12:19 PM

APCOB Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కో - ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (ఆప్కాబ్‌) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. విజయవాడలోని బ్రాంచీలో మేనేజర్, స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టులను...

APCOB Recruitment: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కో – ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
Apcob Recruitment
Follow us on

APCOB Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కో – ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (ఆప్కాబ్‌) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. విజయవాడలోని బ్రాంచీలో మేనేజర్, స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 61 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో మేనేజర్‌(స్కేల్‌1)–26, స్టాఫ్‌ అసిస్టెంట్లు–35 ఖాళీలున్నాయి.
* మేనేజర్‌ (స్కేల్‌1) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్‌ విభాగాల్లో 40 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. అంతేకాకుండా తెలుగు, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీతోపాటు కంప్యూటర్‌ పరిజ్ఙానం తప్పనిసరి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 01.06.2021 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
* స్టాఫ్‌ అసిస్టెంట్లు పోస్టులకు అప్లై చేసుకునే వారు 40 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. తెలుగు, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 01.06.2021 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఆన్‌లైన్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదిగా 05.08.2021 నిర్ణయించారు.
* ఆన్‌లైన్‌ పరీక్ష తేదీని 2021 సెప్టెంబర్‌ మొదటి వారంలో నిర్వహిస్తారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: UPSC Recruitment 2021: కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖలో ఉద్యోగాలు… రూ.1,42,000 వేతనం..!

ICAR AIEEA 2021: ఐకార్‌ వ్యవసాయ కోర్సులకు నోటిఫికేషన్‌ విడుదల.. అర్హులెవరు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

Metro Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. మెట్రోలో ఉద్యోగాలు.. జీతం రూ.80 వేల నుంచి..!