AP Group-1 Mains: గ్రూప్‌-1 మెయిన్స్‌ను వాయిదా వేయాలంటూ ఏపీపీఎస్సీకి విజ్ఞప్తులు

|

Mar 17, 2023 | 9:50 PM

గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ప్రకటించిన కేవలం 85 రోజుల వ్యవధిలోనే మెయిన్స్‌ నిర్వహించడంపై కొందరు అభ్యర్ధులు కమిషన్‌ను ఆశ్రయించారు. పరీక్షలకు సన్నద్ధం..

AP Group-1 Mains: గ్రూప్‌-1 మెయిన్స్‌ను వాయిదా వేయాలంటూ ఏపీపీఎస్సీకి విజ్ఞప్తులు
AP Group-1 Mains
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేయాలంటూ పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఏప్రిల్‌ 23 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ప్రకటించిన కేవలం 85 రోజుల వ్యవధిలోనే మెయిన్స్‌ నిర్వహించడంపై కొందరు అభ్యర్ధులు కమిషన్‌ను ఆశ్రయించారు. పరీక్షలకు సన్నద్ధం అవ్వడానికి సమయం సరిపోవడం లేదని అభ్యర్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో సుమారు నాలుగు నెలల సమయం ఇచ్చారని ఈ సారి త్వరిత గతిన నిర్వహించడం వల్ల ప్రిపరేషన్‌కు తగిన సమయంలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏప్రిల్‌, మే నెలల్లో వివిధ రకాల పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నిర్వహించే మౌఖిక పరీక్షలకు గ్రూపు-1 ప్రధాన పరీక్షలు రాయబోయే అభ్యర్థులు హాజరయ్యే అవకాశముందని అంటున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రధాన పరీక్షలను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా 111 గ్రూప్‌ 1 పోస్టులకు ఈ ఏడాది జనవరి 8న గ్రూప్‌1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. కేవలం 20 వ్యవధిలోనే ఫలితాలను కూడా ప్రకటించింది. 1:50 చొప్పున 6,455 మంది అభ్యర్ధులను మెయిన్స్‌కు ఎంపిక చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.