AP 10th Results: కొనసాగుతోన్న ఏపీ టెన్త్ ఎగ్జామ్ వాల్యుయేషన్.. ఫలితాలు ఎప్పుడు విడుదల చేయనున్నారంటే..
AP 10th Results: ఆంధప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 6,22,537 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పేపర్ మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతోంది...
AP 10th Results: ఆంధప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 6,22,537 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పేపర్ మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతోంది. మే 13 నుంచి మొదలైన పేపర్ వాల్యుయేషన్ ఇప్పటికే 25 శాతం కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా పాఠశాల విద్య రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద రెడ్డి పదో తరగతి పరీక్షల ఫలితాలను జూన్ 10న విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.
చిత్తూరు జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న పేపర్ వాల్యుయేషన్ ప్రకియను తనిఖీ చేసిన దేవానందర్ రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో ఉమ్మడి జిల్లా డీఈవోలు క్యాంప్ ఆఫీసర్లుగా మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఈ ప్రక్రియ ముగియగానే విజయవాడలోని రాష్ట్ర పరీక్షల విభాగం కార్యాలయంలో డీ కోడింగ్ ప్రక్రియ నిర్వహించి.. జూన్ 10న ఫలితాల వెల్లడికి చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది విద్యా సంవత్సరం నుంచి 26 జిల్లాలను యూనిట్‌గా తీసుకుని పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని దేవానందరెడ్డి తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..