పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయన్న టెన్షన్ మొదలైంది. ఏడాదంతా పుస్తకాలతో కుస్తీపడి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఫలితాలు వెల్లడయ్యే సమయం ఆసన్నమైంది. ఏప్రిల్ 22వ తేదీన ఉదయం 11 గంటలకు ఫలితాల విద్యశాఖ విడుదల చేయనుంది. ఈ సంవత్సరం టెన్త్ పత్రాల మూల్యాంకనం రికార్డు స్థాయిలో వేగంగా పూర్తి చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేయాలని భావించిన ఏపీ విద్యాశాఖ.. సోమవారం విడుదల చేయనుంది.
ఇదిలా ఉండగా, మార్చి నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు అధికారులు తెలిపారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 6.23 లక్షలు కాగా, గత ఏడాది ఫెయిల్ అయిన విద్యార్థులు లక్షకుపైగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3473 పరీక్షా కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించారు అధికారులు. విద్యార్థులు ఫలితాలను చెక్ చేసుకునేందుకు https://tv9telugu.com/, https://www.bse.ap.gov.in/ ఈ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని కెరీర్ & ఉద్యోగాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి