ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్‌లో జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హైకోర్టుతో పాటు, జిల్లా కోర్టుల్లో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేయగా తాజాగా జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ప్రాసెస్ సర్వర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 439 ప్రాసెసర్ సర్వర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వీటిలో అనంతపురం (30), చిత్తూరు (42), తూర్పు గోదావరి (26), గుంటూరు (72), వైఎస్ఆర్ కడప (25), కృష్ణా (50), కర్నూలు (23), ఎస్‌సీఎస్‌ఆర్ నెల్లూరు (22), ప్రకాశం (27), శ్రీకాకుళం (49), విశాఖపట్నం (40), విజయనగరం (22), పశ్చిమ గోదావరి (11) జిల్లాల వారీగా ఖాళీలు ఉన్నాయి.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి పూర్తి చేసి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 01-07-2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష, సర్టిఫికేట్ వెరికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 23,780 నుంచి రూ. 76,730 వరకు చెల్లిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ 22-10-2022 తేదీన మొదలుకాగా 11-11-2022తో ముగియనుంది.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..