Amazon Jobs: అమెజాన్‌లో భారీగా ఉద్యోగాలు.. కొత్తగా 11 ఫుల్‌ ఫిల్మెంట్‌ కేంద్రాలు..పూర్తి వివరాలివే..!

| Edited By: Subhash Goud

Jul 16, 2021 | 1:04 PM

Amazon Jobs: ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇక ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్ భారతదేశంలో తన నిల్వ సామర్థ్యాన్ని దాదాపు 40 శాతం.

Amazon Jobs: అమెజాన్‌లో భారీగా ఉద్యోగాలు.. కొత్తగా 11 ఫుల్‌ ఫిల్మెంట్‌ కేంద్రాలు..పూర్తి వివరాలివే..!
Amazon India
Follow us on

Amazon Jobs: ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇక ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్ భారతదేశంలో తన నిల్వ సామర్థ్యాన్ని దాదాపు 40 శాతం విస్తరించే ప్రణాళికలు ప్రకటించింది. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా అమెజాన్‌ ఇండియా 11 కొత్త ఫుల్‌ ఫిల్మెంట్‌ కేంద్రాలను ప్రారంభించి, ప్రస్తుతం ఉన్న తొమ్మిది ఫుల్ ఫిల్ మెంట్లను విస్తరించనుంది. ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లు, వేర్‌ హౌస్‌ సెంటర్లతో అమెజాన్ ఇండియా దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. దీని ద్వారా త్వరలో పదివేల ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని అమెజాన్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది

అమెజాన్ వైస్‌ ప్రెసిడెంట్‌ అఖిల్ సక్సేనా మాట్లాడుతూ.. అమెజాన్‌ తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాలు, వినియోగదారులకు సేవలనదించడంతో పాటుగా మరింతగా ముందుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అదే సమయంలో విస్తృత ఎంపిక, వేగవంతమైన డెలివరీతో వినియోగదారులకు అందిస్తామని తెలిపారు.

రాజస్థాన్‌, అసోం, బీహార్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, ఢిల్లీ, పశ్చిమ బెంగాల, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లను అమెజాన్‌ విస్తరించనుంది. ఈ విస్తరణలో భాగంగా అమెజాన్‌ ఇండియా 60కిపైగా ఫుల్‌పిల్‌మెంట్‌ కేంద్రాలు స్థాపించడంతో రోజువారీ అవసరాలకు ఉపయోగపడే కొత్త ఉత్పత్తుల కొనుగోలుకు కొత్తగా 25 ప్రత్యేక వెబ్ సైట్లు ఉండనున్నట్లు తెలిపారు. ఇక ప్రైమ్‌ డే 2021కి ముందు కొన్ని కొత్త ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెటర్లను ప్రారంభిస్తామని వెల్లించారు. www.amazon.in , అమెజాన్ మొబైల్ షాపింగ్ యాప్ లో వినియోగదారులందరికీ 200 మిలియన్ ఉత్పత్తులకు సంబంధించిన వస్తువులు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇవీ కూడా చదవండి:

Tutoroot: ఉపాధ్యాయులకు శుభవార్త.. ట్రైన్ ది టీచర్‌ పేరుతో ఉచితంగా ఆన్‌లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్

Infosys: గ్రాడ్యుయేట్ల‌కు గుడ్ న్యూస్‌.. 35వేల మందికి ఉద్యోగ అవకాశాలు: ఇన్ఫోసిస్‌