Airports Authority of India Junior Executive Recruitment 2022: భారత ప్రభుత్వ పౌరవిమానయాన మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (Airports Authority of India).. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల (Junior Executive Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 400
పోస్టుల వివరాలు: జూనియర్ ఎగ్జి్క్యూటివ్ పోస్టులు
పే స్కేల్: నెలకు రూ.40,000ల నుంచి రూ.1,40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో బ్యాచిలర్స్ డిగ్రీ/బీఎస్సీ/ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంగ్లిష్ చదవడం, రాయడం, మాట్లాడడంలో నైపుణ్యం ఉండాలి. ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, వాయిస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జూన్ 15, 2022.
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 14, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.