TATA Jobs: ఈ ఏడాది 5,100 కొత్త నియామకాలు చేపట్టనున్న ఎయిరిండియా

|

Feb 25, 2023 | 9:40 PM

ఎయిరిండియా ఈ ఏడాది 5,100 నియామకాలు చేపట్టనుంది. వీటిల్లో 4,200 కేబిన్‌ సిబ్బంది పోస్టులు కాగా మిగిలిన 900 పైలట్‌ పోస్టులు. నిర్వహణ ఇంజినీర్లతో పాటు మరింత మంది పైలట్లనూ నియమించుకుంటామని ఎయిరిండియా..

TATA Jobs: ఈ ఏడాది 5,100 కొత్త నియామకాలు చేపట్టనున్న ఎయిరిండియా
Air India
Follow us on

ఎయిరిండియా ఈ ఏడాది 5,100 నియామకాలు చేపట్టనుంది. వీటిల్లో 4,200 కేబిన్‌ సిబ్బంది పోస్టులు కాగా మిగిలిన 900 పైలట్‌ పోస్టులు. నిర్వహణ ఇంజినీర్లతో పాటు మరింత మంది పైలట్లనూ నియమించుకుంటామని ఎయిరిండియా ఇన్‌ఫ్లైట్‌ సర్వీసెస్‌ విభాగాధిపతి సందీప్‌ వర్మ తెలిపారు. విమానాల సంఖ్యను భారీగా పెంచుకోవడంతో పాటు, దేశీయంగా, అంతర్జాతీయ మార్గాల్లో కార్యకలాపాలను విస్తరించుకునే యత్నాల్లో ఎయిరిండియా ఉంది. ఆ క్రమంలో కొత్త నియామకాలు చేపట్టనున్నట్లు తెల్పింది. బోయింగ్‌, ఎయిర్‌బస్‌ నుంచి 70 పెద్ద (వైడ్‌బాడీ)వి సహా మొత్తం 470 విమానాల కొనుగోలుకు ఎయిరిండియా చర్యలు చేపట్టింది. ఈ ఏడాది ఆఖరు నుంచి ఈ విమానాల సరఫరా ప్రారంభమవుతుంది. వీటితోపాటు మరో 36 విమానాలను కూడా సంస్థ లీజ్‌కు తీసుకుంటోంది.

వీటిల్లో బోయింగ్‌ 777-200 విమానాలు 2 ఇప్పటికే సంస్థకు చేరాయి కూడా. 2022 జనవరిలో ఎయిరిండియా టాటా గ్రూపు చేతికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత గతేడాది మే నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి కాలంలో 1,900 మందికి పైగా కొత్త సిబ్బందిని సంస్థ నియమించుకుంది. ‘జులై- జనవరి మధ్య 1,100 మంది కేబిన్‌ సిబ్బంది శిక్షణ తీసుకున్నారని, వీరిలో 500 మంది గత మూడు నెలల్లో విమానాల్లో సేవలందించేందుకు అనుమతులు ఇచ్చినట్లు కంపెనీ తెలిపింది. కేబిన్‌ సిబ్బందికి 15 వారాల పాటు శిక్ష ఇచ్చిన తర్వాత విధుల్లోకి తీసుకోనున్నట్లు ఓ ప్రకటనలో తెల్పింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.