AIIMS Rishikesh Faculty Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన రిషికేష్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఫ్యాక్టల్టీ (Teaching staff)పోస్టుల భర్తీకి అర్హులైన అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీలు: 95
పోస్టుల వివరాలు: ఫ్యాక్టల్టీ పోస్టులు
విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, జనరల్ సర్జరీ, అంకాలజీ, న్యూరాలజీ ఇతర విభాగాల్లోని ఖాళీలు భర్తీ చేయనున్నారు.
ఖాళీల వివరాలు:
1. ప్రొఫెసర్ పోస్టులు
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్/ఎంసీహెచ్/ఎండిఎస్/డీఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం 11 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.2,20,400లు
2. అడిషనల్ ప్రొఫెసర్ పోస్టులు
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్/ఎంసీహెచ్/ఎండిఎస్/డీఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం 7 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.2,11,400లు
3. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్/ఎంసీహెచ్/ఎండిఎస్/డీఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం 3 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.2,09,200లు
4. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్/ఎంసీహెచ్/ఎండిఎస్/డీఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.1,67,400లు
5. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పోస్టులు
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్/పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం 3-14 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 50 ఏళ్లు మించరాదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: రూ.3000
దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 31, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: