AIIMS Recruitment: తెలంగాణ బీబీనగర్ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
AIIMS Recruitment: తెలంగాణలోని బీబీనగర్‌లో ఉన్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
AIIMS Recruitment: తెలంగాణలోని బీబీనగర్‌లో ఉన్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం…
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 08 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో అనెస్తీషియా, ఎఫ్‌ఎంటీ, జనరల్ మెడిసిన్, ఆప్తల్మాలజీ, పాథాలజీ, అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, రేడియాలజీ, ట్రామా అండ్ ఎమర్జన్సీ మెడిసిన్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పిజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్/ డీఎం/ ఎంసీహెచ్/ డీఎన్‌బీ) పూర్తి చేసి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 67,700 జీతంగా చెల్లిస్తారు.
* అభ్యర్థులను నేరుగా వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఇంటర్వ్యూలను మే 18, 19 తేదీల్లో బీబీ నగర్ ఎయిమ్స్, ఆడిటోరియంలో నిర్వహించనున్నారు.
* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 12-05-2022ని నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తలకు క్లిక్ చేయండి..
Also Read: Andhra Pradesh: మళ్లీ అదే వ్యధ.. బిడ్డ మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన తండ్రి.. కన్నీటి పర్యంతం
IPL 2022: కసి తీర్చుకున్న డేవిడ్ వార్నర్.. హైదరాబాద్‌ని వీర బాదుడు బాదేశాడుగా..!
Viral Video: చికెన్ ముక్కల కోసం మహిళ రచ్చ అంత ఇంత కాదు.. దండం పెట్టిన పోలీసులు..!