AIIMS Recruitment 2022: రాత పరీక్షలేకుండా ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నేరుగా ఇంటర్వ్యూ..

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌.. 147 సీనియర్‌ రెసిడెంట్/సీనియర్‌ డెమోన్‌స్ట్రేటర్‌ (నాన్‌ అకడమిక్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ

AIIMS Recruitment 2022: రాత పరీక్షలేకుండా ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నేరుగా ఇంటర్వ్యూ..
AIIMS New Delhi Recruitment 2022

Updated on: Nov 07, 2022 | 5:03 PM

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌.. 147 సీనియర్‌ రెసిడెంట్/సీనియర్‌ డెమోన్‌స్ట్రేటర్‌ (నాన్‌ అకడమిక్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అనెస్థీషియాలజీపెయిన్‌ మెడిసిన్‌ అండ్‌ క్రిటికల్ కేర్‌, ఆంకాలజీ అనెస్థీషియాలజీ, కార్డియాక్‌ అనెస్థీషియాలజీ, న్యూరో అనెస్థీషియాలజీ, ఫార్మకాలజీ, మెడికల్‌ ఆంకాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్‌, మెడిసిన్‌, న్యూరో సర్జరీ, పీడియాట్రిక్స్‌, పల్మనరీ మెడిసిన్‌, యూరాలజీ, మైక్రోబయాలజీ, కార్డియాలజీ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఎంబీబీఎస్‌, డీఎమ్‌సీ పీజీ/ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ/ఎమ్‌హెచ్‌ఏ/ఎమ్మెస్సీ/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన అభ్యర్ధులు నవంబర్‌ 9, 2022వ తేదీన కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. అర్హత సాధించిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్‌: Jawahar Lal Nehru Auditorium, AIIMS, New Delhi-110029.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.