భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఒరిస్సా రాష్ట్రంలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. 99 సీనియర్ రెసిడెంట్ (నాన్-అకడమిక్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అనెస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఎండోక్రినాలజీ, ఈఎన్‌టీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, ఆప్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్ సర్జరీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, ఫార్మకాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనిర్సిటీ నుంచి సంబంధత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండీ, డీఎన్‌బీ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 45 యేళ్లకు మించకుండా ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఈ రోజు (సెప్టెంబర్ 30, 2022) ముగింపు సమయంలోపు ఈమెయిల్ ద్వారా అప్లికేషన్లను పంపించవచ్చు. అనంతరం కింది అడ్రస్‌కు అక్టోబర్ 8వ తేదీలోపు పోస్టు ద్వారా దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది. ట్రాన్సాక్షన్ ఛార్జీల కింద జనరల్ అభ్యర్ధులు రూ.1500, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1200లు చెల్లించవల్సి ఉంటుంది. వికలాంగ అభ్యర్ధులకు దరఖాస్తు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.67,700లతోపాటు ఇతర అలవెన్సులను కూడా జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఈమెయిల్ ఐడీ: academic@aiimsbhubaneswar.edu.in
అడ్రస్:
REGISTRAR
ALL INDIA INSTITUTE OF MEDICAL SCIENCES (AIIMS), BHUBANESWAR
ADMINISTRATIVE BLOCK, 1ST FLOOR
SIJUA, POST: DUMUDUMA, BHUBANESWAR (ODISHA) – 751019
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.