AIASL Recruitment 2022: రాత పరీక్షలేకుండా ఎయిర్‌ ఇండియా ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెస్‌లో 309 ఉద్యోగాలు.. పదో తరగతి/డిగ్రీ అర్హత..

|

Nov 06, 2022 | 4:52 PM

ఎయిర్‌ ఇండియా ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌.. 309 కస్టమర్‌ ఏజెంట్, యుటిలిటీ ఏజెంట్‌ కమ్‌ ర్యాంప్‌ డ్రైవర్‌, హ్యాండీమ్యాన్‌ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష/మహిళా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

AIASL Recruitment 2022: రాత పరీక్షలేకుండా ఎయిర్‌ ఇండియా ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెస్‌లో 309 ఉద్యోగాలు.. పదో తరగతి/డిగ్రీ అర్హత..
AIASL Recruitment 2022
Follow us on

ఎయిర్‌ ఇండియా ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌.. 309 కస్టమర్‌ ఏజెంట్, యుటిలిటీ ఏజెంట్‌ కమ్‌ ర్యాంప్‌ డ్రైవర్‌, హ్యాండీమ్యాన్‌ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష/మహిళా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పోస్టును బట్టి పదో తరగతి/డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఎయిర్లైన్‌ డిప్లొమా సర్టిఫికేట్‌ ఉండాలి లేదా ఎయిర్‌లైన్‌/జీహెచ్‌ఏ/కార్గో/ఎయిర్‌లైన్‌ టికెటింగ్‌లో అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 28 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఎవరైనా నవంబర్‌ 12, 13, 14, 15, 16 తేదీల్లో కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్వూకి నేరుగా హాజరుకావచ్చు. ఐతే జనరల్‌/ఓబీసీ అభ్యర్ధులకు రూ.500లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. అర్హత సాధించిన అభ్యర్ధులకు నెలకు రూ.17,520ల నుంచి రూ.21,300ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో పనిచేయవల్సి ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • కస్టమర్‌ ఏజెంట్ పోస్టులు: 144
  • యుటిలిటీ ఏజెంట్‌ కమ్‌ ర్యాంప్‌ డ్రైవర్‌ పోస్టులు: 15
  • హ్యాండీమ్యాన్‌ పోస్టులు: 150

అడ్రస్: Office of the HRDDepartment,Air India UnityComplex, PallavaramCantonment, Chennai – 600043.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.