Emerging Tech Skills: అధునాతన నైపుణ్యాలకు ఫుల్ డిమాండ్.. 2030 నాటికి ఏకంగా 10 లక్షల ఉద్యోగాలు

|

Dec 31, 2024 | 1:53 PM

మారుతున్న కాలంతోపాటు నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకుంటే వచ్చే కాలమంతా అనుకూలంగా ఉంటుందని తాజా నివేదికలు జోష్యం చెబుతున్నాయి. ముఖ్యంగా AI, మెషిన్ లెర్నింగ్ (ML), సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, బ్లాక్‌చెయిన్‌లకు వంటి అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలకు జాబ్ మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉన్నట్లు తెలుస్తుంది..

Emerging Tech Skills: అధునాతన నైపుణ్యాలకు ఫుల్ డిమాండ్.. 2030 నాటికి ఏకంగా 10 లక్షల ఉద్యోగాలు
Emerging Tech Skills
Follow us on

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్‌ వంటి ఆధునిక సాంకేతికతలు 2030 నాటికి సుమారు 10 లక్షల ఉద్యోగాలను సృష్టించనున్నాయి. ఈ మేరకు Quess IT స్టాఫింగ్ నివేదిక వెల్లడించింది. ‘టెక్నాలజీ స్కిల్స్ రిపోర్ట్, డిసెంబర్ 2024’ పేరిట విడుదల చేసిన ఈ నివేదికలో.. వివిధ డొమైన్‌లలో నైపుణ్యాల వార్షిక వృద్ధిని వివరించింది. AI, మెషిన్ లెర్నింగ్ (ML), సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, బ్లాక్‌చెయిన్‌లకు వంటి అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలు కంపెనీల భవితవ్యాన్ని మారుస్తున్నాయి. దీనిపై Quess IT స్టాఫింగ్ సీఈవో కపిల్ జోషి మాట్లాడుతూ.. నేటి ఆధునిక టెక్నాలజీ వర్క్‌ఫోర్స్ పరివర్తనాత్మక మార్పును చూస్తోంది. అభివృద్ధి చెందుతున్న ఈ సాంకేతికతలు 2030 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థకు హితోధికంగా దోహదం చేయనుంది. సుమారు150 బిలియన్ల డాలర్లకు పైగా వృద్ధికి దోహదపడతాయని నివేదిక అంచనా వేసింది.

భారత్‌ ఐటీ రంగంలో మొత్తం శ్రామిక శక్తి 2030 నాటికి 5.4 మిలియన్ల నుంచి 7.5 మిలియన్లకు పెరుగుతుందని తాజా నివేదిక అంచనా వేసింది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు అధిక డిమాండ్ ఉన్నందున రానున్న రోజుల్లో సుమారుగా 20 లక్షలకు పైగా ఉద్యోగాలు ఈ రంగంలో రానున్నట్లు పేర్కొంది. ఇక బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగంలో సురక్షిత లావాదేవీలు, మోసాలను గుర్తించడం, ఐడెంటిటీ నిర్వహణలో సైబర్‌ సెక్యూరిటీ, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీలు కీలకంగా మారనున్నాయి. ఆరోగ్య సంరక్షణ రంగంలో ప్రిడిక్టివ్ అనలిటిక్స్, పర్సనలైజ్డ్ మెడిసిన్, డ్రగ్ డిస్కవరీ, పేషెంట్ డేటా విశ్లేషణలో డేటా సైన్స్ ఎయిడ్స్, టెలిహెల్త్‌లలో అప్లికేషన్‌లకు ఈ సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయి. .

రిటైల్, ఇ-కామర్స్ రంగాల్లో ఈ సాంకేతికతలు కొత్త ఒరవడి సృష్టించనున్నాయి. బ్లాక్‌చెయిన్ నియామకం గణనీయమైన వృద్ధిని సాధించింది. గ్లోబల్ డిమాండ్ 2023 ఏడాదిలో 76 శాతానికి పైగా పెరిగింది. BFSI, సప్లై చైన్‌, హెల్త్‌ కేర్‌, IT సేవలు వంటి రంగాల్లో బ్లాక్‌ చెయిన్‌ పాత్రలు 2021 – 2023 మధ్య 60 శాతం పెరిగాయి. క్లౌడ్ కంప్యూటింగ్ నియామకాలు 2023లో ప్రపంచవ్యాప్తంగా 30-35 శాతం వృద్ధి సాధించాయి. ఐటి సేవలు, కన్సల్టింగ్, మీడియా, టెలికమ్యూనికేషన్స్ (TMT), ఆటోమోటివ్ వంటి పరిశ్రమలు కూడా క్లౌడ్ ఆధారిత పరిష్కారాల వైపు అడుగులు వేస్తున్నాయి. ఇక ఉద్యోగ నియామకాల్లో 43.5 శాతం వృద్ధతో బెంగళూరు టాప్‌లో కొనసాగుతుంది. హైదరాబాద్ (13.4 శాతం), పూణే (10 శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.