అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. న్యూఢిల్లీలోని ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న ఐసీఏఆర్ పరిశోధన సంస్థలు/కేంద్రాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. నాన్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ పోస్టులను ఐదేళ్ల పదవీ కాల ప్రాతిపదికన ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 349 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, డివిజన్ హెడ్, రీజనల్ స్టేషన్/సెంటర్ హెడ్, సీనియర్ సైంటిస్ట్ కమ్ హెడ్, కేవీకే పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డాక్టోరల్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ప్రిన్సిపల్ సైంటిస్ట్/ప్రొఫెసర్ లేదా తత్సమాన హోదాలో పని అనుభవం లేదా పరిశోధన/బోధన అనుభవం కలిగి ఉండాలి.
* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 47 ఏళ్ల నుంచి 60 ఏళ్లు మించకూడదు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను అకడమిక్ క్వాలిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, హెడ్ ఆఫ్ డివిజన్స్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.1,44,200 నుంచి రూ.2,18,200, సీనియర్ సైంటిస్ట్-కమ్-హెడ్ పోస్టులకు ఎంపికై వారికి రూ.1,31,400 నుంచి రూ.2,17,100 జీతంగా చెల్లిస్తారు.
* ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, హెడ్ ఆఫ్ డివిజన్స్ పోస్టుల దరఖాస్తుకు 31-10-2022 చివరి తేదీ కాగా, సీనియర్ సైంటిస్ట్ కమ్ హెడ్ పోస్టులకు 11-11-2022 చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..