Adani University: నవతరం విద్యార్థులకు అదానీ యూనివర్శిటీ అపూర్వ స్వాగతం

అదానీ యూనివర్సిటీలో నూతనంగా జాయిన్ అయిన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యా, పరిశోధన, టెక్నాలజీ, అభివృద్ధిపై వ్యక్తలు విలువైన సందేశాలు ఇచ్చారు. నవతరం మార్పుకు మీరు కారకులవ్వాలి అంటూ AI, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

Adani University: నవతరం విద్యార్థులకు అదానీ యూనివర్శిటీ అపూర్వ స్వాగతం
Adani University

Updated on: Jul 24, 2025 | 4:28 PM

అహ్మదాబాద్‌లోని అదానీ యూనివర్సిటీ కొత్త విద్యా సంవత్సరం ప్రారంభ వేడుకలో దేశం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులను సాదరంగా స్వాగతించింది. యూనివర్సిటీ ప్రొవోస్ట్ డా. రవి పి. సింగ్ మాట్లాడుతూ “మీరు ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇన్ఫ్రాస్ట్రక్చర్‌, లేదా గ్రీన్ ఎనర్జీ అయినా సరే ఇది మీకు సరైన ప్లేస్. మీరు సొంతంగా కొత్త మార్గాలు సృష్టించండి. మరొకరి బాటలో వెళ్లకండి” అని విద్యార్థులకు ప్రేరణనిచ్చారు. విద్య అనేది దేశ నిర్మాణానికి ఉపయోగపడే గొప్ప అవకాశం అని తెలిపారు.

AIలో విప్లవం.. మనకు కొత్త ఛాలెంజ్

అదానీ గ్రూప్ ప్రతినిధి భట్టాచార్యా మాట్లాడుతూ… “ఇది మనుషుల ఆలోచనా శక్తికి సవాల్ విసురుతున్న తొలి పరిశ్రమాత్మక మార్పు. మెషిన్లు ఆలోచించగలవు. కానీ మనుషులే కలలు కనగలరు, కలిసికట్టుగా పనిచేయగలరు” అన్నారు. అదానీ గ్రూప్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 90 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టుతోందని.. అందులో టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో యువతికి విస్తృత అవకాశాలున్నాయని వివరించారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా. అమిష్ కుమార్ వ్యాస్ మాట్లాడుతూ “మీ అందరిలోని కళను చూస్తే భవిష్యత్తుపై ఆశాజనకంగా ఉంది” అంటూ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

“AI ఇప్పుడు రోబోటిక్స్, ఆటోమేషన్‌తో కలిసిపోతోంది. కేవలం కోడింగ్ నేర్చుకోవడమే కాదు… ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ను కూడా బలంగా అర్థం చేసుకోవాలి. ఇవే రియల్ వరల్డ్‌ను అర్థం చేసుకోవడంలో కీలకం.” అని అదానీ యూనివర్శిటీ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ సునీల్ ఝా చెప్పారు

“మీరు దేవుడు ఇచ్చిన ప్రత్యేకతను గుర్తించండి. అదే మార్గంలో నిబద్ధతతో నడవండి. ప్రతి రోజు ప్రశ్నలు వేసుకుంటూ నేర్చుకుంటూ ముందుకు సాగండి. విశ్వవిద్యాలయం అనేది మీ జీవిత లక్ష్యం కోసం ఓ డిస్కవరీ జరగాల్సిన ప్రదేశం” అని ప్రముఖ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ విద్యార్థులకు చెప్పారు.

అదానీ యూనివర్శిటీ గుజరాత్‌లో ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీ. ఇక్కడ ఇంజినీరింగ్, టెక్నాలజీ, బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సులు ఉన్నాయి. బీటెక్, ఎంటెక్, MBAతో పాటు ఇంటిగ్రేటెడ్ కోర్సులు కూడా అందిస్తున్నారు. 1800 మందికిపైగా విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. విద్యా సంస్థల నిర్వహణలో ‘గోల్డ్ స్టాండర్డ్’గా పరిగణించే ISO 21001:2018 అనే గుర్తింపు సైతం ఈ యూనివర్శిటీకి ఉంది. మరిన్ని వివరాలకు యూనివర్శిటీ అధికారిక వెబ్‌సైట్: www.adaniuni.ac.in ను సందర్శించడండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.