ఉద్యోగాల తొలగింపు అంశం గత కొన్ని రోజులుగా ప్రపంచాన్ని షేక్ చేసిన విషయం తెలిసిందే. ప్రపంచ దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. చిన్న చిన్న స్టార్టప్‌లు మొదలు మల్టీ నేషనల్ కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగించాయి. అయితే తాజాగా ఇలాంటి వార్తలు కాస్త తగ్గాయని అందరు సంతోషించేలోపే ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా మరో బాంబ్ పేల్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ టెక్ దిగ్గజం మరోసారి ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 11,000 మందిని తొలగించిన మెటా తాజాగా మరో 1000 మందిని తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అవసరం లేని టీమ్‌లను తొలగించాలని మెటా నిర్ణయించినట్లు సమాచారం. ప్రకటనల నుంచి వచ్చే ఆదాయం తగ్గడంతో ఆర్థిక లక్ష్యాలను మెటా చేరుకోలేకపోతోంది. ఈ కారణంతోనే మరోసారి ఉద్యోగుల తొలగింపునకు ఆ సంస్థ సిద్ధమైందని సంబంధింత వర్గాలు వెల్లడించినట్టు బ్లూమ్‍బర్గ్ పేర్కొంది. ఉద్యోగం నుంచి తొలగించే అభ్యర్థుల జాబితాను తయరా చేయాలని ఇప్పటికే వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్లను మెటా కోరినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ఓవైపు ఉద్యోగులను తొలగిస్తున్న మెటా మరోవైపు వర్చువల్ రియాలిటీ వేదిక మెటావర్స్‌పై మెటా భారీ ఎత్తున ఖర్చు చేస్తోంది. ఇందుకోసం మెటా భారీగా ఖర్చు చేస్తోంది. అయితే దీని ద్వారా ఆదయం ఇప్పట్లో రాలేని పరిస్థితి. ఇందులో భాగంగానే మెటా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఉద్యోగుల తొలగింపు మెటాతో ఆగిపోతాయా.? మరికొన్ని కంపెనీలకు చేరుతాయా చూడాలి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..