AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AAICLAS Jobs 2026: నిరుద్యోగులకు అలర్ట్.. ఎయిర్‌పోర్టుల్లో సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు

ఎయిర్​పోర్ట్ అథారిటీ ఆఫ్​ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ (ఏఏఐసీఎల్ఏఎస్).. మూడేళ్ల ఒప్పంద ప్రాతిపదికన సెక్యూరిటీ స్క్రీనర్ (ఫ్రెషర్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద

AAICLAS Jobs 2026: నిరుద్యోగులకు అలర్ట్.. ఎయిర్‌పోర్టుల్లో సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు
AAICLAS Security Screener Recruitment
Srilakshmi C
|

Updated on: May 19, 2026 | 11:25 AM

Share

కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన ఎయిర్​పోర్ట్ అథారిటీ ఆఫ్​ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ (ఏఏఐసీఎల్ఏఎస్).. మూడేళ్ల ఒప్పంద ప్రాతిపదికన సెక్యూరిటీ స్క్రీనర్ (ఫ్రెషర్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 158 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారు డెహ్రాడూన్‌, కోల్‌కతా, పాట్నా, త్రిచి, కాలికట్, ఉదయ్‌పూర్‌లలోని ఎయిర్‌ పోర్టులలో విధులు నిర్వహించవల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఎయిర్​పోర్ట్ అథారిటీ ఆఫ్​ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీలో ఉద్యోగాలకు దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు

  • డెహ్రాడూన్‌లో పోస్టుల సంఖ్య: 17
  • కోల్‌కతాలో పోస్టుల సంఖ్య: 25
  • పాట్నాలో పోస్టుల సంఖ్య: 37
  • త్రిచిలో పోస్టుల సంఖ్య: 28
  • కలికట్‌లో పోస్టుల సంఖ్య: 17
  • ఉదయ్‌పూర్‌లో పోస్టుల సంఖ్య: 34

సెక్యూరిటీ స్క్రీనర్ (ఫ్రెషర్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 60 శాతం, ఎస్సీ, ఎస్టీలు 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్ధుల గరిష్ట వయోపరిమితి మే 1, 2026వ తేదీ నాటికి 27 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 8, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు కింద జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.750. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ మహిళా అభ్యర్థులు రూ.100 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అంటే ఎలాంటి రాత పరీక్ష ఉండదన్నమాట. ఎంపికైన వారికి తొలి ఏడాది ప్రతి నెలా రూ.30 వేలు, రెండో ఏడాది ప్రతి నెలా రూ.32 వేలు, మూడో ఏడాది ప్రతి నెలా రూ.34 వేలు చొప్పున చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

ఎయిర్​పోర్ట్ అథారిటీ ఆఫ్​ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీలో ఉద్యోగాలకు దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us