AAI Recruitment: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. ఎలా ఎంపిక చేస్తారంటే..

|

Oct 24, 2023 | 2:30 PM

మొత్తం 496 పోస్టులకు గాను యూఆర్‌ క్యాండిడేట్స్‌ (199), ఈడబ్ల్యూఎస్‌ క్యాండిడేట్స్‌ (49), ఓబీసీ (ఎన్‌సీఎల్‌) క్యాండిడేట్స్‌ (140), ఎస్‌సీ క్యాండిడేట్స్‌ (75), ఎస్టీ క్యాండిడేట్స్‌ (33) పోస్టులు ఉన్నాయి. పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఎస్సీ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. డిగ్రీలో ఫిజిక్స్‌, మ్యాథమెటక్స్‌లో డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. ఇంజనీరింగ్ చేసిన వారు కూడా...

AAI Recruitment: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. ఎలా ఎంపిక చేస్తారంటే..
AAI Jobs
Follow us on

ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పలు పోస్టులను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 496 పోస్టులను భర్తీ చేయనున్నారు.

మొత్తం 496 పోస్టులకు గాను యూఆర్‌ క్యాండిడేట్స్‌ (199), ఈడబ్ల్యూఎస్‌ క్యాండిడేట్స్‌ (49), ఓబీసీ (ఎన్‌సీఎల్‌) క్యాండిడేట్స్‌ (140), ఎస్‌సీ క్యాండిడేట్స్‌ (75), ఎస్టీ క్యాండిడేట్స్‌ (33) పోస్టులు ఉన్నాయి. పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఎస్సీ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. డిగ్రీలో ఫిజిక్స్‌, మ్యాథమెటక్స్‌లో డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. ఇంజనీరింగ్ చేసిన వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక వయసు పరిమితి విషయానికొస్తే అభ్యర్థుల వయసు నవంబర్‌ 30, 2023 నాటికి 27 ఏళ్లు మించకూడదు.

అభ్యర్థులను రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. మొదట ఆబ్జెక్టివ్‌ టైప్‌ ఆన్‌లైన్‌ పరీక్షను నిర్వహిస్తారు. అనంతరం అప్లికేషన్‌ వెరిఫికేషన్‌, వాయిస్‌ టెస్ట్‌, సైకోక్టివ్‌ సబ్‌స్టాన్స్‌ టెస్ట్‌, సైకలాజికల్‌ అసెస్‌మెంట్ టెస్ట్‌, మెడికల్ టెస్ట్‌, బ్యాగ్రౌండ్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు రూ. 1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ కేటగిరికి చెందిన వారు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఇంటర్న్‌షిప్‌ చేసిన వారితో పాలు మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

జీతం విషయానికొస్తే జూనియర్‌ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 40,000 నుంచి రూ. 1,40,000 వరకు చెల్లిస్తారు. వీటితోపాటు అదనంగా హెచ్‌ఆర్‌ఏ, సీపీఎఫ్‌, గ్రాట్యుటీ, స్పెషల్‌ సెక్యూరిటీ స్కీమ్స్‌తో మెడికల్ బెనిఫిట్స్‌ను అందిస్తారు. దీంతో మొత్తం సీటీసీ ఏడాదికి రూ. 13 లక్షల వకు పొందుతారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..