Central Government Job Vacancies in Various Departments In India: కేంద్ర ప్రభుత్వలోని వివిధ మంత్రిత్వశాఖల్లో దాదాపు 8,72,243 పోస్టులు ఖాళీగా ఉన్నాయని బుధవారం (మార్చి 16) లోక్‌సభలో శివసేన సభ్యుడు అరవింద్ సావంత్ అడిగిన ప్రశ్నకు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణశాఖ మంత్రి జితేంద్రసింగ్ (Minister Jitendra Singh) ఇచ్చిన సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కేంద్రంలోని మొత్తం 77 మంత్రిత్వశాఖల పరిధిలో 40,04,941 పోస్టులు మంజూరుకాగా, ప్రస్తుతం వీటిలో 31,32,698 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు తెలిపారు. రక్షణ విభాగంలో 6,33,139 పోస్టులకుగాను 3,85,637 మంది ఉద్యోగులున్నారు. ఈశాఖ పరిధిలోనే దాదాపు 2,47,502 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక హోంశాఖలో 1,28,842 పోస్టులు, పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో 90,050 పోస్టులు, రెవెన్యూ విభాగంలో 76,327 పోస్టులు భర్తీచేయాల్సి ఉన్నట్లు తెలిపారు. ఇక రైల్వేలో 2,94,687 ఖాళీలుండగా.. 1,53,974 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిచేసినట్లు తెలిపారు. ఇంకా 1,40,713 ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రారంభించామని, ఇది పరీక్షల దశలో ఉందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో తెలిపారు. నోటిఫై చేసిన ఖాళీల్లో దక్షిణమధ్య రైల్వేలో 16,736, సికింద్రాబాద్ ఆర్‌ఆర్‌బీ పరిధిలో 10,038 ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఖాళీలను త్వరలో భర్తీచేయడానికి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఆయన అన్నారు. రైల్వేలను ప్రైవేటీకరించే ఉద్ధేశ్యం ప్రభుత్వానికిలేదని ఈ సందర్భంగా తెలిపారు.
Also Read: