ఆకర్షిస్తోన్న ఆవు, గాడిద, ఒంటెల స్నేహాం..నెట్టింట్లో వైరల్
స్నేహానికి జాతి భేదం ఉండదని నిరూపించే దృశ్యం ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మూడు విభిన్నమైన జాతులకు చెందిన మూగజీవాల స్నేహాం నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. ఆవు, గాడిద, ఒంటె ఈ మూడు జంతువులు మూడు జాతులకు చెందినవి. ఈ జంతువులు ఏ జాతికి ఆ జాతి జంతువులతోనే కలిసి ఉంటాయి. ముఖ్యంగా ఆవు, గాడిదలు ఒకే గుంపుతో ఎప్పుడూ కలిసి తిరిగిన దాఖలాలు లేవు. ఒకరకంగా అవి అస్సలు కలవవనే చెప్పాలి. కానీ […]

స్నేహానికి జాతి భేదం ఉండదని నిరూపించే దృశ్యం ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మూడు విభిన్నమైన జాతులకు చెందిన మూగజీవాల స్నేహాం నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. ఆవు, గాడిద, ఒంటె ఈ మూడు జంతువులు మూడు జాతులకు చెందినవి. ఈ జంతువులు ఏ జాతికి ఆ జాతి జంతువులతోనే కలిసి ఉంటాయి. ముఖ్యంగా ఆవు, గాడిదలు ఒకే గుంపుతో ఎప్పుడూ కలిసి తిరిగిన దాఖలాలు లేవు. ఒకరకంగా అవి అస్సలు కలవవనే చెప్పాలి. కానీ అమెరికాలోని కన్సాస్‌లో ఒక ఆవు, గాడిద, ఒంటె రోడ్లపై కలిసి తిరుగుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోను ఇటీవల గోడార్డ్ పోలీసులు తమ ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశారు. దీంతో పాటుగానే వీటి యజమాని ఎవరో సమాచారం ఇవ్వాలని కోరారు. కాగా ఈ ఫోటోను నవంబర్ 19 నాటికి వెయ్యిమందికి పైగా షేర్ చేశారు. దీంతో వైరల్‌గా మారిన ఈ ఫోటోకు ఇప్పుడు షేర్లు, లైక్‌లు లక్షలు దాటిపోతున్నాయి. క్రిస్టమస్ సీజన్‌లో ఇలా ఈ మూడు జంతువులు కలిసి మెలిసి తిరగటం మరింత విశేషంగా భావిస్తున్నారు అక్కడి స్థానికులు.