
Zomato: ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో, క్విక్ కామర్స్ యాప్ బ్లింకిట్ మాతృ సంస్థ అయిన ఎటర్నల్ తన ప్లాట్‌ఫామ్ ఫీజులను పెంచింది. కస్టమర్ల నుండి తీసుకునే రూ.10 ప్లాట్‌ఫామ్ ఛార్జీని ఇప్పుడు రూ.12కి పెంచినట్లు కంపెనీ మంగళవారం ప్రకటించింది. అంటే దాదాపు 20% పెరుగుదల అమల్లోకి వచ్చింది. కంపెనీ మొదట ప్లాట్‌ఫామ్ ఛార్జీని ఆగస్టు 2, 2023న ప్రవేశపెట్టడం మొదలు పెట్టింది.
ఇది కూడా చదవండి: Upcoming Cars: మారుతి నుండి మహీంద్రా వరకు.. సెప్టెంబర్‌లో లాంచ్ అయ్యే ఈ 5 అద్భుతమైన కార్లు!
ఈ పెరుగుదల కేవలం రూ.2 మాత్రమే అనిపించినప్పటికీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం, దాని ప్రభావం చాలా పెద్దది. కంపెనీ రోజుకు దాదాపు 25 లక్షల ఆర్డర్‌లను పూర్తి చేస్తుందని అంచనా. అటువంటి పరిస్థితిలో కంపెనీ ప్లాట్‌ఫామ్ ఫీజుల ద్వారా రోజుకు రూ.15 కోట్ల వరకు అదనపు ఆదాయాన్ని సంపాదించవచ్చు. వార్షిక ప్రాతిపదికన ఈ ఆదాయం రూ.180 నుండి 200 కోట్లకు చేరుకుంటుందని అంచనా. అయితే ఈ నిర్ణయంపై వినియోగదారులు కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒకవైపు ప్లాట్‌ఫామ్‌లో డిస్కౌంట్లు, ఆఫర్‌లను తగ్గిస్తూనే, మరోవైపు ప్లాట్‌ఫామ్ ఫీజులను నిరంతరం పెంచుతున్నారని వారు అంటున్నారు. అయితే ఫుడ్ ఆర్డర్ చేసేవారికి 2 రూపాయలు అంటే పెద్దగా పట్టించుకోరు. కానీ కంపెనీకి మాత్రం కోట్లల్లో లాభం ఉంటుంది.
ఇది కూడా చదవండి: Slimmest Smartphone: ఇది ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్.. నేడు భారత్‌లో విడుదల
కంపెనీ లాభాలు పెరుగుతాయి:
జూన్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం కేవలం రూ.25 కోట్లకు తగ్గగా, గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ.253 కోట్లుగా ఉంది. అయితే మరోవైపు, కంపెనీ ఆదాయం రూ.4,206 కోట్ల నుంచి రూ.7,167 కోట్లకు పెరిగింది. బ్లింకిట్, ఇతర కొత్త వ్యాపారాలలో దూకుడుగా పెట్టుబడులు పెట్టడం వల్ల ఈ పెరుగుదల సాధ్యమైంది.
జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజు ప్రయాణం:
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి