Yulu EV Bikes: మార్కెట్‌లో మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్.. అదిరిపోయే ఫీచర్స్‌తో పాటు బజాజ్ నమ్మకం..

|

Feb 28, 2023 | 5:00 PM

మిరాకిల్ జీఆర్, డీఈఎక్స్ జీఆర్ పేర్లతో ఆవిష్కరిస్తున్న ఈ స్కూటర్లు కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటాయని కంపెనీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. యూఎస్ఏలో ఇటీవల నిర్వహించిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో యులూ కంపెనీ మిరాకిల్ జీఆర్ బైక్‌ను రిలీజ్ చేసింది.

Yulu EV Bikes: మార్కెట్‌లో మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్.. అదిరిపోయే ఫీచర్స్‌తో పాటు బజాజ్ నమ్మకం..
Yulu Dex
Follow us on

ఎలక్ట్రిక్ వెహికల్ రెంటల్ కంపెనీ అయిన యులు బైక్స్ త్వరలో రెండు ఈవీ స్కూటర్లను మార్కెట్‌లోకి రిలీజ్ చేయనుంది. సూపర్ లుక్‌తో వస్తున్న ఈ స్కూటర్లకు బజాజ్ ఆటో లిమిటెడ్ సహకారం అందించనుంది. మిరాకిల్ జీఆర్, డీఈఎక్స్ జీఆర్ పేర్లతో ఆవిష్కరిస్తున్న ఈ స్కూటర్లు కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటాయని కంపెనీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. యూఎస్ఏలో ఇటీవల నిర్వహించిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో యులూ కంపెనీ మిరాకిల్ జీఆర్ బైక్‌ను రిలీజ్ చేసింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారులను టార్గెట్ చేస్తూ ఈ రెండు స్కూటర్లు మార్కెట్‌లోకి రానున్నాయి. బజాజ్ ఈవీతో యులు బైక్ కలయిక కచ్చితంగా వినియోగదారులకు బడ్జెట్ రైడ్ అందిస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ముఖ్యం ఈవీ వెహికల్స్‌లో బజాజ్, యులు కలయిక నెంబర్ వన్ స్థానంలో నిలిపేలా చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మేడ్ ఫర్ ఇండియా వాహనాల మార్కెట్‌ను పెంచేలా ఈ రెండు కంపెనీలు తమతమ భాగస్వామ్యంతో ఈవీ వెహికల్స్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. అలాగే పట్టణ ప్రాంత వినియోగదారుల కోసమే ఈ స్కూటర్లను రిలీజ్ చేయడం అనేది రెండు కంపెనీల వ్యూహంగా తెలుస్తుంది. ఈ రెండు స్కూటర్లలో అందించే ఆ ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

మిరాకిల్ జీఆర్ ఫీచర్లు ఇవే

మిరాకిల్ జీఆర్ స్టైలిష్ డిజైన్‌తో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. ట్రాఫిక్ ఇబ్బందులను మర్చిపోయేలా సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని పొందవచ్చు. అధునాతన సాంకేతికతతో, మీరు తక్కువ నిర్వహణ ఖర్చులతో మృదువైన, సమర్థవంతమైన ప్రయాణాన్ని పొందవచ్చు. ఇది ఐఓటీ సాంకేతికతతో నడిచే స్మార్ట్ డాక్‌లెస్ ఈవీ స్కూటర్. అలాగే గంటలకు 25 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పట్టణవాసులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ స్కూటర్ బరువు చాలా తక్కువ ఉండడంతో వెంటనే వేగాన్ని అందుకుంటుంది. 

డీఈఎక్స్ జీఆర్ లక్షణాలు

డీఈఎక్స్ జీఆర్ లాస్ట్ మైల్ డెలివరీలకు సౌకర్యంగా ఉంటుంది. అంటే ఈ వాహనం ముఖ్యంగా డెలివరీ బాయ్స్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఓకే చార్జ్ అధిక మైలేజ్‌ను ఇచ్చేలా ఈ స్కూటర్‌ను డిజైన్ చేశారు. ఈ స్కూటర్ ఐఓటీ సాంకేతికతతో నడుస్తుంది. దాదాపు 15 కిలోల వస్తువుల వరకూ దీని ద్వారా డెలివర్ చేయవచ్చు. సౌకర్యవంతమైన రైడ్ అందించే విషయంలో ఏ మాత్రం రాజీ లేకుండా ఈ స్కూటర్‌ను రూపొందించారు. సూపర్ పవర్ హెడ్‌లైట్, టైల్ లైట్‌తో ఇది కచ్చితంగా వినియోగదారులను ఆక్టుకుంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..