Tax Deduction: బ్యాంకింగ్ రంగాలలో ప్రతి నెల నిబంధనలు మారుతూ ఉంటాయి. బ్యాంకింగ్ రంగంతో పాటు ఇతర అంశాలలో అనేక మార్పులు జరుగుతుంటాయి. ఇక గృహ రుణం (Home Loan) తీసుకునే వారికి ఓ మంచి అవకాశం ఉంది. ఇల్లు కట్టుకోవాలనుకుంటే మార్చి 31, 2022లోపు బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఆదాయపు పన్ను చట్టం (Income Tax Act) 1961 సెక్షన్ 80ఈఈఏ కింద అఫర్డబుల్ హౌసింగ్ కోసం అదనపు పన్ను డిడక్షన్ (Tax Deduction) పొందాలంటే మార్చి 31 వరకు ముందే రుణం తీసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1, 2022 తర్వాత ప్రభుత్వం ఈ పన్ను ప్రయోజనాలను అందించడం లేదని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2022 (Budget 2022) లో ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2022-23 నుంచి ఈ ట్యాక్స్ బ్రేక్‌లను అందుబాటులో ఉండడం లేదని తెలిపింది.
అదాయపు పన్ను చట్టం సెక్షన్ 24 కింద అందుబాటులో ఉండే రూ.2 లక్షల డిడక్షన్‌కు అదనంగా సెక్షన్ 82EEA కింద రూ.1.5 లక్షల వరకు మినహాయింపులును ప్రభుత్వం ఈ రుణాలకు కల్పిస్తోంది. అఫర్డబుల్ హోమ్ లోన్ కోసం రుణం తీసుకున్నవారు తాము చెల్లించే వడ్డీకి సెక్షన్ 24,80ఈఈఏ కింద గరిష్టంగా రూ.3.5 లక్షల డిడక్షన్లను క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే క్లెయిమ్ చేసుకోవాలంటే ఏప్రిల్ 1, 2019 నుంచి మార్చి 31, 2022 మధ్య ఆర్థిక సంస్థల నుంచి గృహ రుణం జారీ చేసి ఉండాలి. అప్పుడే మీకు ఈ బెనిఫిట్ లభిస్తుంది. రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ స్టాంప్ డ్యూటీ వాల్యూ రూ.45 లక్షలకు మించకుండా ఉండాలి. అలాగే రుణం జారీ అయ్యే సమయానికి ఎలాంటి రెసిడెన్షియల్ ప్రాపర్టీని కలిగి ఉండకూడదు.
ఇవి కూడా చదవండి: