Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Investment Tips: పెట్టుబడుల సమయంలో ఆ విషయాన్ని తెలుసుకోవాల్సిందే..! లేకపోతే పన్ను బాదుడు షురూ

జీతం పొందే ఉద్యోగి చిన్న మొత్తాలను మ్యూచువల్ ఫండ్ ఎస్‌ఐపీల్లో పెట్టుబడి పెట్టవచ్చు లేదా ఆ వ్యక్తి కొంత బంగారాన్ని కూడబెట్టుకోవచ్చు. అయితే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు పెట్టుబడిదారుడు పెట్టుబడులను రిడీమ్ చేయడం వల్ల కలిగే పన్ను ప్రభావాలకు దూరంగా ఉండకూడదు.

Money Investment Tips: పెట్టుబడుల సమయంలో ఆ విషయాన్ని తెలుసుకోవాల్సిందే..! లేకపోతే పన్ను బాదుడు షురూ
Invest
Follow us
Srinu

|

Updated on: Jul 24, 2023 | 7:50 PM

డబ్బుకు లోకం దాసోహం అనే సామెత మనం ఎప్పటి నుంచో వింటుంటాం. అది సామెత అయినా ప్రస్తుత రోజులకు కరెక్ట్‌గా సరిపోతుంది. పెట్టుబడి విషయాల్లో  తప్పుడు నిర్ణయాలు, ఊహించని సంఘటనలు, వ్యక్తిగత లేదా ఆర్థిక కారణాల వల్ల ఆర్థిక ఒత్తిడి తలెత్తవచ్చు . అయితే అనుకోని అవసరాల సమయాల్లో స్నేహితుడిగా ఉండాలనే లక్ష్యంతో పెట్టుబడులు పెడుతున్నారు. జీతం పొందే ఉద్యోగి చిన్న మొత్తాలను మ్యూచువల్ ఫండ్ ఎస్‌ఐపీల్లో పెట్టుబడి పెట్టవచ్చు లేదా ఆ వ్యక్తి కొంత బంగారాన్ని కూడబెట్టుకోవచ్చు. అయితే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు పెట్టుబడిదారుడు పెట్టుబడులను రిడీమ్ చేయడం వల్ల కలిగే పన్ను ప్రభావాలకు దూరంగా ఉండకూడదు. అలాంటి పెట్టుబడిదారుల మనస్సులో భయాన్ని కలిగించడం, అలాంటి పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికి అదనపు పన్ను ఖర్చును చూపడం, పెట్టుబడి బలంతో వారి నుంచి డబ్బును అప్పుగా తీసుకోవడం రుణదాతలకు అలవాటుగా మారింది. మ్యూచువల్ ఫండ్ లేదా బంగారం యూనిట్లను విక్రయించినప్పుడు, లాభాలపై పన్ను విధించబడుతుంది. కాబట్టి పెట్టుబడి విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఓ సారి తెలుసుకుందాం.

రుణదాత నుంచి డబ్బు తీసుకోవడానికి పెట్టుబడిని సెక్యూరిటీగా ఉపయోగిస్తే ఎటువంటి పన్ను బాధ్యత తలెత్తదు. కానీ చాలా మంది పెట్టుబడిదారులు ఇటువైపుగా ఆలోచించరు. ఒత్తిడి, స్వల్పకాలిక ప్రయోజనాలకు పెట్టుబడులను ఎందుకు రిస్క్‌ చేయాలనే ఆలోచనతో వారు ఆలోచించరు. అయితే మనం ఎస్‌ఐపీల్లో పెట్టుబడి పెట్టి దాన్ని పది ఏళ్ల తర్వాత విక్రయిస్తే ఆ సమయంలో పెట్టుబడికి వడ్డీ కట్టాల్సి ఉంటుంది. కాబట్టి చెడు పెట్టుబడి నిర్ణయం నుంచి నిష్క్రమించడం అనేక సార్లు చిన్న పన్ను మినహాయింపును కూడా ఇస్తుంది. కొత్త పెట్టుబడిదారుడు  స్టాక్ ఆప్షన్‌ల గురించి పెద్దగా ఆలోచన లేకుండా ఆప్షన్‌లను విక్రయిస్తే పెట్టుబడులు లాభాలు కాకుండా నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. కాబట్టి స్టాక్స్‌ పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది ఉద్యోగులు కేవలం సంస్థ అందించే పీఎఫ్‌ను పెట్టుబడిగా చూస్తారు. అలా కాకుండా బ్యాంకులు, పోస్టాఫీసులు అందించే పీపీఎఫ్‌ పథకాలను ఎంచుకోవడం ద్వారా పెట్టుబడిదారులకు అదనపు పన్ను ప్రయోజనాలు ఉంటాయి. అలాగే పెట్టుబడిపై రిస్క్‌ తీసుకోవాలనుకునే వ్యక్తులు మూడు సంవత్సరాల లాక్‌ఇన్‌ ఉన్న ట్యాక్స్‌ సేవల మ్యూచువల్‌ ఫండ్స్‌లో కూడా పెట్టుబడి కొనసాగించవచ్చు.

మార్కెట్ సంబంధిత రిస్క్‌లు ఉన్నప్పటికీ టాక్స్ సేవర్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి రిస్క్ తగ్గుతుందని నిర్ధారించడానికి రెగ్యులేటర్‌లు తగిన రక్షణలను రూపొందించారు. పెట్టుబడిపై రాబడిని లెక్కించేటప్పుడు పన్ను వ్యయం కారకంగా ఉండాలి. అయితే ఆర్థిక ప్రణాళికకు పన్ను ఎప్పుడూ ఏకైక ప్రమాణంగా ఉండకూడదు. తరచుగా అనుభవజ్ఞులైన పెట్టుబడిదారుల సలహాదారులు బీమా ఉత్పత్తులను పెట్టుబడి మార్గాలుగా చూడకూడదని హెచ్చరిస్తారు. ఎందుకంటే బీమా ఉత్పత్తులకు పన్ను మినహాయింపులు లభించవు.  కాబట్టి పెట్టుబడి విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి