NPS: ఇప్పుడు మీరు యూపీఐ ద్వారా ఆన్‌లైన్‌లో ఎన్‌పీఎస్‌ వాయిదాను డిపాజిట్ చేయవచ్చు.. ఎలాగంటే..

|

Dec 02, 2022 | 3:19 PM

మీరు నేషనల్ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌) స్కీమ్‌ అకౌంట్‌ను ఓపెన్ చేసి ఉంటే యూపీఐ ద్వారా కూడా ఇంట్లోనే ఉండి ఇన్‌స్టాల్‌మెంట్‌ డబ్బులను ఆన్‌లైన్‌లో జమ చేసే సదుపాయం ఉంది. దీని కోసం మీరు..

NPS: ఇప్పుడు మీరు యూపీఐ ద్వారా ఆన్‌లైన్‌లో ఎన్‌పీఎస్‌ వాయిదాను డిపాజిట్ చేయవచ్చు.. ఎలాగంటే..
Nps
Follow us on

మీరు నేషనల్ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌) స్కీమ్‌ అకౌంట్‌ను ఓపెన్ చేసి ఉంటే యూపీఐ ద్వారా కూడా ఇంట్లోనే ఉండి ఇన్‌స్టాల్‌మెంట్‌ డబ్బులను ఆన్‌లైన్‌లో జమ చేసే సదుపాయం ఉంది. దీని కోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. వీరి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం జాతీయ పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత పెన్షన్‌గా పొందే ఎన్‌పీఎస్‌ ఖాతాలో ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని జమ చేస్తారు. ఎన్‌పీఎస్‌ సభ్యులు ప్రతి నెలా తమ నిర్ణీత మొత్తాన్ని చెక్కు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా అందించవచ్చు.

ఎన్‌పీఎస్‌ సభ్యుడు వారి సహకారం మొత్తాన్ని యూపీఐ ద్వారా ఖాతాలో జమ చేయవచ్చు. యూపీఐ ద్వారా డబ్బు డిపాజిట్‌ చేసే విధానం చాలా సులభమే. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) అనేది మొబైల్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి తక్షణ నిధుల బదిలీని ప్రారంభించే రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్. మీరు యూపీఐ మద్దతు ఉన్న బ్యాంక్ ఖాతాతో యూపీఐ ఐడీని సృష్టించవచ్చు. డబ్బు పంపడానికి దాన్ని ఉపయోగించవచ్చు.

యూపీఐని ఎలా యాక్టివేట్‌ చేయాలి..?

  • ఎన్‌పీఎస్‌ ఖాతా సభ్యులు ముందుగా యాప్ స్టోర్ లేదా బ్యాంక్ వెబ్‌సైట్ నుండి యూపీఐ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • ఆపై మీకు నచ్చిన యూపీఐ ఐడీ(వీపీఏ)ని నమోదు చేయండి. ఉదాహరణకు abc@upi
  • లావాదేవీ ప్రమాణీకరణ కోసం మీ రహస్య ఎంపీఐఎన్‌ (MPIN)ని సెట్ చేయండి.
  • బ్యాంక్, ఖాతా నంబర్‌ను వీపీఏకి లింక్ చేయండి.
  • దీని తర్వాత మీ యూపీఐ యాక్టివేట్ అవుతుంది.

యూపీఐ నుండి ఎన్‌పీఎస్‌కి ఇన్‌స్టాల్‌మెంట్‌ను ఎలా డిపాజిట్ చేయాలి

  • ఎన్‌పీఎస్‌ ట్రస్ట్ వెబ్‌సైట్ ప్రకారం.. వినియోగదారు యూపీఐని చెల్లింపు ఎంపికగా ఎంచుకోవాలి.
  • ఎన్‌పీఎస్‌ సభ్యులు యూపీఐ ద్వారా మాత్రమే రూ.2000 వరకు ఆన్‌లైన్ చెల్లింపు చేయవచ్చు.
  • సభ్యులు వర్చువల్ చెల్లింపు చిరునామా (VPA) నమోదు చేయాలి.
  • దీని తర్వాత చెల్లింపు సమాచారం UPI అప్లికేషన్‌పై స్వీకరించబడుతుంది.
  • వినియోగదారు UPI అప్లికేషన్‌కు లాగిన్ చేయాలి
  • దీని తర్వాత లావాదేవీని నిర్ణీత సమయంలోగా నిర్ధారించాలి.

UPI చెల్లింపు నుండి ఈ ప్రయోజనాలు:

UPI చెల్లింపు వ్యవస్థ అనేది రియల్ టైమ్ చెల్లింపు ప్రక్రియ. దీనిలో మీరు కొన్ని నిమిషాల్లో ఒక ఖాతా నుండి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయవచ్చు. ఎన్‌పిఎస్‌తో పాటు అటల్ పెన్షన్ యోజన ఖాతాదారుల కోసం ఈ సౌకర్యం ప్రారంభించబడింది. దీనితో పాటు మీరు ఉదయం 9.30 లోపు చెల్లింపు చేస్తే, ఆ చెల్లింపు ఆ రోజుకు లెక్కించబడుతుంది. లేకపోతే ఆ తర్వాత ఈ చెల్లింపు మరుసటి రోజుకు పరిగణించబడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి