
బంగారం ధర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత గరిష్ట స్థాయికి చేరుకుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1.27 లక్షలు దాటింది. కేవలం ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 50 శాతం ధర పెరిగింది. అయితే అసలు ప్రపంచంలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే దేశం ఏంటో తెలుసా? అక్కడ ఏడాదికి ఎంత బంగారాన్ని వెలికి తీస్తారో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు.
ప్రపంచంలో అతి పెద్ద బంగారు గని పేరు నెవాడా గోల్డ్ మైన్.ఇది అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో ఉంది. ఈ గనిలో ప్రతి సంవత్సరం టన్నుల కొద్ది బంగారం వెలికి తీస్తుంటారు. భూమిపైనే అతిపెద్ద బంగారు గనిగా ఈ ప్రాంతం పేరు సంపాదించుకుంది. ఈ గోల్డ్ మైన్ ను బారిక్ గోల్డ్, న్యూమెంట్ కార్పొరేషన్ అనే కంపెనీలు కలిపి నడుపుతున్నాయి. ఈ గనిలో ప్రతి సంవత్సరం సుమారు వంద టన్నులు అంటే లక్ష కిలోల బంగారం వెలికి తీస్తున్నారు. ప్రస్తుతం భూమిపై వాడుకలో ఉన్న అతిపెద్ద బంగారు గని ఇదే.
ఈ గనిలో ప్రతిరోజు సుమారు 280 కేజీల బంగారం వెలికి తీస్తారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఈ బంగారు గని ఒక నిధిగా ఉపయోగపడుతుంది. ఇకపోతే ప్రస్తుతానికి ప్రపంచంలో ఎక్కువ గోల్డ్ రిజర్వ్స్ ఉన్న దేశం కూడా అమెరికానే. దానికి ఈ గని కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. మనదేశంలో కూడా బంగారు గనులు ఉన్నప్పటికీ వాటి నుంచి లభించే బంగారం చాలా తక్కువ. కాబట్టి మనం బంగారం ఇతర దేశాల నుంచే ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం.
ఇకపోతే మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలో ఎక్కువ బంగారు నిల్వలు ఉన్న దేశం అమెరికానే అయినా అంతకంటే ఎక్కువ బంగారం మన భారతీయ మహిళల దగ్గరే ఉంది. అమెరికా గోల్డ్ రిజర్వ్స్ మొత్తం కలిపి సుమారు 8 వేల టన్నులు అయితే భారతీయ మహిళల దగ్గర సుమారు 24 వేల టన్నుల బంగారం ఉందని ఒక అంచనా.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి