Electric Vehicles: చవకైన బ్యాటరీలు వచ్చేశాయ్.. ఇక ఎలక్ట్రిక్ వాహనాల రేట్లు మరింత తగ్గుతాయి.. వివరాలు ఇవి..

ప్రపంచంలో మొట్టమొదటి సోడియం అయాన్ బ్యాటరీతో నడిచే వాహనాన్ని చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ జేఏసీ ఆటో ఆవిష్కరించింది. లిథియం అయాన్ బ్యాటరీల కన్నా చవకగా వీటిని అందించనుంది.

Electric Vehicles: చవకైన బ్యాటరీలు వచ్చేశాయ్.. ఇక ఎలక్ట్రిక్ వాహనాల రేట్లు మరింత తగ్గుతాయి.. వివరాలు ఇవి..
Electric Charging
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 26, 2023 | 5:06 PM

మార్కెట్లో విద్యుత్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. దానిని అందిపుచ్చుకునేందుకు అన్ని కంపెనీలు ఆరాటపడుతున్నాయి. అయితే అన్ని కంపెనీలు దాదాపు లిథియం అయాన్ బ్యాటరీలనే వినియోగిస్తున్నాయి. అయితే ప్రపంచంలో మొట్టమొదటి సోడియం అయాన్ బ్యాటరీతో నడిచే వాహనాన్ని చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ జేఏసీ ఆటో ఆవిష్కరించింది. లిథియం అయాన్ బ్యాటరీల కన్నా చవకగా వీటిని అందించనుంది. ఈ అయాన్ బ్యాటరీని బీజింగ్ కు చెందిన స్టార్టప్ హీనా బ్యాటరీ టెక్నాలజీస్ అభివృద్ధి చేసిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. ఈ సోడియం-అయాన్ బ్యాటరీని ఉపయోగించడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల ధర కనీసం 10 శాతం తగ్గుతుందని, పెట్రోల్, డీజిల్ లేదా CNG వాహనాలతో పోలిస్తే ఈవీల పనితీరును మెరుగు పరుస్తుందని మార్కెట్ల వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరింత చవక..

పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం,ః సోడియం-అయాన్ బ్యాటరీలు చౌకైన ముడి పదార్థాలను ఉపయోగించి తయారు చేయబడ్డాయి. అందువల్ల ఈ బ్యాటరీ ధర తగ్గుతుంది. ఫలితంగా ఎలక్ట్రిక్ వాహనం ధరను కూడా తగ్గే అవకాశం ఉంది. అంతేకాక మార్కెట్లో మోనో పోలి అవకాశం లేకుండా సోడియం అయాన్ బ్యాటరీలు ప్రత్యామ్నాయంగా నిలబడతాయి. సాధారణంగా లిథియం చాలా ఖరీదైనది. అలాగే కోబాల్ట్ కూడా ఖరీదైనది. అందుకే వీటిని వినియోగించకుండా సోడియం వినియోగించడం ద్వారా మొత్తం ధర తగ్గుతుంది.

కొత్త బ్యాటరీ వాహనం ఎలా ఉంది..

చైనీస్ జేఏసీ నుంచి వచ్చిన సోడియం అయాన్ బ్యాటరీ వాహనంలో 25 కిలోవాట్-అవర్ (kWh) బ్యాటరీ అమర్చబడి ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్‌పై 250 కిలోమీటర్ల దూరం వెళ్లగలుగుతుంది. ఈ సందర్భంగా బ్యాటరీ తయారు దారు హీనా మాట్లాడుతూ గత సంవత్సరం లిథియం కార్బోనేట్ ధరలు పెరగడం వల్ల చాలా మంది బ్యాటరీ తయారీదారులు, వినియోగదారులు ఖర్చు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయం ఉంటే మంచిదని నిర్ధారించి ఆ దిశగా ప్రయోగాలు చేసి సోడియం-అయాన్ బ్యాటరీలు తయారు చేశామన్నారు. ఇది మెరుగైన ధరలో మంచ పనితీరు, అధిక భద్రత అందిస్తాయన్నార. ఇవి లిథియం-అయాన్ బ్యాటరీలకు అత్యంత ఆశాజనక ప్రత్యామ్నాయంగా నిలబడతాయని చెప్పారు.

ఇవి కూడా చదవండి

తన ముద్ర వేస్తున్న చైనా కంపెనీలు..

చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్‌లు నెమ్మదిగా ప్రపంచ స్థాయిలో ముద్ర వేస్తున్నాయి. అనేక టాప్ ఆటోమేకర్‌లను మించిపోతున్నాయి. ముఖ్యంగా చైనీస్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ BYD విదేశాలలో కార్యకలాపాలను విస్తరిస్తోంది, ఎలోన్ మస్క్ నడుపుతున్న టెస్లాను అధిగమించేందుకు 2023కి యూనిట్ విక్రయ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 40 కంటే ఎక్కువ దేశాలలో పనిచేస్తున్న BYD ఈ సంవత్సరం జపాన్, ఆగ్నేయాసియా, యూరప్‌లోని పలు దేశాలతో సహా దాదాపు రెండు మిలియన్ల ఈవీలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..