Moonlighting by employees is cheating: ఐటీ ఉద్యోగులు తమ రెగ్యులర్ ఉద్యోగాలతో పాటు సైడ్ ప్రాజెక్ట్‌లను చేపట్టడంపై విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ శనివారం (ఆగస్టు 20) కీలక వ్యాఖ్యలు చేశారు. టెక్ ఇండస్ట్రీలో ఏక కాలంలో ఒకటికిమించి (మూన్‌లైట్) ఉద్యోగాలు చేయడం ‘మోసం’తో సమానమని తన ట్విటర్ ఖాతాలో పెట్టిన పోస్టు ద్వారా తెలిపారు. ఫుడ్‌టెక్ స్టార్ట్-అప్ స్విగ్గీ తమ ఉద్యోగులకు మూన్‌లైటింగ్ పాలసీని ఇటీవల తీసుకొచ్చింది. ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఖాళీ సమయాల్లో ఇతర కంపెనీల్లో పనిచేసేందుకు అనుమతించింది. స్విగ్గీ నిర్ణయానికి స్పందిస్తూ రిషద్ ప్రేమ్‌జీ తాజా వ్యాఖ్యలు చేశారు. ‘ఐటీ పరిశ్రమలో మూన్‌లైటింగ్‌పై చాలా చర్చ జరుగుతోంది. అది మోసపూరితం అవుతుందని తన అభిప్రాయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేశారు. కరోనా మహమ్మారి మూలంగా ఐటీ రంగంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వడం, డిజిటలీకరణ పెరిగి, నిపుణులకు గిరాకీ పెరగడంతో, ఒకటికి మించి ఉద్యోగాలు చేయడం ప్రారంభించారు.
టెక్ ఇండస్ట్రీలో మూన్‌లైటింగ్ చేసే వ్యక్తుల గురించి చాలా విషయాలు వెలుగులోకొచ్చాయి. ఇది మోసం. ఇలా చేయడంలో వల్ల మార్జిన్‌లపై ఒత్తిడి, టాలెంట్ సప్లై చెయిన్‌లో అసమర్థత వంటి కారణాల రిత్యా పనితీరు ఆధారంగా ఉద్యోగులకు ఇచ్చే వేరియబుల్ వేతనాన్ని విప్రో ఏప్రిల్-జూన్‌కు నిలిపివేసింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా ఇదే పందాలో నడుస్తోంది.
There is a lot of chatter about people moonlighting in the tech industry. This is cheating – plain and simple.
— Rishad Premji (@RishadPremji) August 20, 2022
నిజానికి మూన్‌లైటింగ్ కొత్తదేమీ కాదు. ఐటీ, ఐటీ స్పేస్‌లో 400 మంది వ్యక్తులపై ఇటీవల కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 65 శాతం మంది వర్క్ ఫ్రం హోం చేస్తూ పార్ట్‌టైమ్ అవకాశాలు లేదా మూన్‌లైటింగ్‌ను అనుసరించే వ్యక్తుల గురించిన విషయాలు వెల్లడయ్యాయి.