హైవేపై ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త. టోల్ ట్యాక్స్‌కు సంబంధించి ప్రభుత్వం త్వరలో కొత్త నిబంధనలను తీసుకురానుంది.2024 సంవత్సరానికి ముందు దేశంలో 26 గ్రీన్ ఎక్స్‌ప్రెస్‌వేలను సిద్ధం చేస్తామని, రోడ్ల విషయంలో అమెరికాతో సమానంగా భారతదేశం ఉంటుందని రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దీంతో హైవే మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు సులభతరంగా ప్రయాణించడమే కాకుండా టోల్ ట్యాక్స్ నిబంధనలలో కూడా మార్పు రావచ్చు.
రాబోయే రోజుల్లో టోల్ టాక్స్ వసూలు చేయడానికి కొత్త టెక్నిక్‌ని ప్రారంభించవచ్చని కూడా కేంద్ర మంత్రి వెల్లడించారు.. టోల్ వసూలు కోసం రెండు ఆప్షన్‌లను పరిశీలిస్తున్నట్లు నితిన్ గడ్కరీ తెలిపారు. కార్లలో జీపీఆర్‌ఎస్ వ్యవస్థను అమర్చడం మొదటి ఆప్షన్ అయితే, రెండవ ఆప్షన్ ఆధునిక నంబర్ ప్లేట్‌లకు సంబంధించినది ఉందని అన్నారు. ఇది కారు వినియోగదారులకు గొప్ప సౌకర్యాన్ని అందిస్తుంది.
ఇప్పటి వరకు దేశంలో టోల్ చెల్లించనందుకు శిక్ష విధించే నిబంధన లేదని, దీనిపై ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని కేంద్రమంత్రి అన్నారు. అయితే రానున్న కాలంలో దీనికోసం కొత్త బిల్లు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ బిల్లు ప్రకారం ప్రయాణికుడు టోల్ పన్ను చెల్లించకపోతే అతను శిక్ష లేదా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
కొంతకాలంగా కొత్త నంబర్ ప్లేట్‌పై దృష్టి సారిస్తున్నామని, వాటి ఎంపికపై కసరత్తు జరుగుతోందని నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం టోల్‌రోడ్డుపై 10 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే 75 కిలోమీటర్లు ఫీజు చెల్లించాల్సి ఉండగా, కొత్త విధానంలో ప్రయాణించే దూరానికి మాత్రమే రుసుము వసూలు చేస్తారు. కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత టోల్‌బూత్‌ల వద్ద రద్దీ ఉండదని, ట్రాఫిక్‌కు కూడా అంతరాయం ఉండదని ఆయన చెప్పారు. ఇది ప్రయాణికులకు సౌకర్యాన్ని అందిస్తుంది. టోల్ బూత్ వద్ద గడిపిన అనవసరమైన సమయాన్ని ముగిస్తుంది. దీని కారణంగా ఎక్కడికైనా ప్రయాణించడానికి తక్కువ సమయం పడుతుంది.
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఎలాంటి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లడం లేదని కేంద్ర మంత్రి తెలిపారు. ఎన్‌హెచ్‌ఏఐ పరిస్థితి పూర్తిగా బాగానే ఉంది.. మంత్రిత్వ శాఖ వద్ద డబ్బుకు కొరత లేదు. గతంలో రెండు బ్యాంకులు కూడా తక్కువ ధరలకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకు రుణాలు ఇచ్చాయని తెలిపారు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి