Indian Jewelery: భారతీయ ఆభరణాల అమ్మకాలు విదేశాల్లో ఎందుకు తగ్గాయి? ఇదే పెద్ద కారణం!

|

Sep 24, 2024 | 6:41 PM

భారతీయ ఆభరణాలు ప్రపంచవ్యాప్తంగా ధరిస్తారు. భారతదేశం దిగుమతి చేసుకునే బంగారాన్ని ఆభరణాలుగా మార్చి ప్రపంచ దేశాలకు విక్రయిస్తున్నారు. భారతీయ ఆభరణాలకు డిమాండ్ ఎప్పుడూ గరిష్ట స్థాయిలోనే ఉంటుంది. భారతీయ వ్యాపారవేత్తలు కూడా ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి ఇదే కారణం. అయితే గత కొంత కాలంగా..

Indian Jewelery: భారతీయ ఆభరణాల అమ్మకాలు విదేశాల్లో ఎందుకు తగ్గాయి? ఇదే పెద్ద కారణం!
Gold Price
Follow us on

భారతీయ ఆభరణాలు ప్రపంచవ్యాప్తంగా ధరిస్తారు. భారతదేశం దిగుమతి చేసుకునే బంగారాన్ని ఆభరణాలుగా మార్చి ప్రపంచ దేశాలకు విక్రయిస్తున్నారు. భారతీయ ఆభరణాలకు డిమాండ్ ఎప్పుడూ గరిష్ట స్థాయిలోనే ఉంటుంది. భారతీయ వ్యాపారవేత్తలు కూడా ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి ఇదే కారణం. అయితే గత కొంత కాలంగా విదేశాల్లో భారతీయ ఆభరణాలకు క్రేజ్ తగ్గి కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. విదేశాల నుండి తక్కువ డిమాండ్ కారణంగా భారతదేశం ఆభరణాల ఎగుమతి గణనీయంగా తగ్గింది. ఎగుమతి గణాంకాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: Electric Cars: ప్రపంచంలో ఎక్కువ ఎలక్ట్రిక్ కార్లు ఉన్న మొదటి దేశం ఏదో తెలుసా?

19 శాతం క్షీణించింది

రత్నాలు, ఆభరణాల ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ డేటా ప్రకారం, ప్రపంచ డిమాండ్ మందగించడంతో భారతదేశ రత్నాలు, ఆభరణాల ఎగుమతులు ఆగస్టులో 18.79 శాతం క్షీణించి 2.01 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఆగస్టు 2023లో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు $2.47 బిలియన్లుగా ఉన్నాయి. అయితే జూలై నెల కంటే కొంత మెరుగ్గా ఉన్నాయని, GJEPC పేర్కొంది. జీజేఈపీసీ చైర్మన్ విపుల్ షా మాట్లాడుతూ అమెరికా, చైనా వంటి ప్రధాన ఎగుమతి మార్కెట్ల డిమాండ్‌ను తీర్చేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఇది కూడా చదవండి: Refrigerator Cleaning Tips: రిఫ్రిజిరేటర్ జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే ఫ్రిజ్‌ మెరిసిపోతుంది!

వజ్రాల ఎగుమతులు 26 శాతం క్షీణించాయి:

ఆగస్టులో కట్, పాలిష్ చేసిన వజ్రాల ఎగుమతి దాదాపు 26 శాతం తగ్గి ఒక బిలియన్ డాలర్లకు పడిపోయిందని, గత ఏడాది ఇదే కాలంలో ఇది 1.36 బిలియన్ డాలర్లుగా నమోదయ్యిందని డేటా వెల్లడించింది.

దేశీయ మార్కెట్ పనితీరు మెరుగ్గా ఉంది:

ఈ గణాంకాలపై కామా జ్యువెలరీ మేనేజింగ్ డైరెక్టర్ కొలిన్ షా మాట్లాడుతూ.. గ్లోబల్ మార్కెట్ పరిస్థితులతో పోలిస్తే దేశీయంగా రత్నాలు, ఆభరణాల రంగం మంచి పనితీరు కనబరుస్తోందని అన్నారు. కస్టమ్స్ సుంకం తగ్గింపు తర్వాత బంగారం ధర తగ్గిందని, దీంతో కొనుగోళ్లు పెరిగాయన్నారు. ఇది క్రమంగా అమ్మకాలను పెంచుతుందన్నారు.

ఇది కూడా చదవండి: BSNL SIM: ఇక నచ్చిన నంబర్‌తో బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌ కార్డు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసుకోవచ్చు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి