Fuel Prices: దేశంలో పెట్రోడీజిల్ ధరలు ఆకాశాన్ని అంటిన సమయంలో కేంద్రం ఒక్కసారిగా వాటిపై విధిస్తున్న పన్నును తగ్గించింది. ఇది అభినందనీయమైన చర్య అయినప్పటికీ.. ప్రజలకు ఆ ఫలాలు పూర్తి స్థాయిలో దక్కే అవకాశం లేనట్లు కనిపిస్తోంది. అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రేట్లను కేంద్రం తగ్గించిన మేర తగ్గించకపోవచ్చని తెలుస్తోంది. ఆదాయాల కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తున్న రాష్ట్ర ప్రభాత్వాలు ఈ తగ్గించిన రేట్లను పూర్తిగా ప్రజలకు బదిలీచేయవని తెలుస్తోంది. అనేక రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు ఈ కేంద్రం నిర్ణయంపై విమర్శలు చేస్తున్నాయి. తమకు చెప్పి కేంద్రం రేట్లు పెంచిందా అంటూ తమిళనాడుకు చెందిన ఒక నేత వ్యాఖ్యానించగా.. జనసేనాని పవర్ కల్యాణ్ మాత్రం ఇది అభినందనీయమైన నిర్ణయమంటూ ట్వీట్ చేశారు.
సెంట్రల్ ఎక్సైజ్ సుంఖాన్ని పెట్రోల్ పై రూ.8, డీజిల్ పై రూ.6 తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ నిర్ణయం కారణంగా పెట్రోల్ ధర లీటరుకు రూ.9.50, లీటర్ డీజిల్ కు రూ. 7 వరకు తగ్గుతాయని అన్నారు. తగ్గింపు నిర్ణయం కారణంగా కేంద్రాని ఏడాదికి రూ. లక్ష కోట్ల ఆదాయం తగ్గుతుందని వెల్లడించారు. ప్రధానిగా నరేంద్ర మోదీ 8 ఏళ్లు త్వరలో పూర్తి చేసుకుంటున్న తరుణంలో రాజకీయ కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనికి అదనంగా ఉజ్వల్ గ్యాస్ సిలిండర్లపై ఏకంగా రూ.200 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం గరిష్ఠాలకు(15.08) తాకిన సమయంలో దానిని అదుపు చేసేందుకు చర్యల్లో భాగంగా ఇంధన ధరలను తగ్గించినట్లు తెలుస్తోంది. ఇంధన ధరలు నేరుగా రిటైల్ వస్తువులపై ఉంటుంది. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయం కారణంగా నిత్యావసరాలు ధరలు తగ్గనున్నాయి. రవాణా ఖర్చలు తగ్గటం వల్ల వాటి రేట్లు దిగివస్తాయని కేంద్రం యోచిస్తోంది. రిజర్వు బ్యాంక్ సైతం ద్రవ్యోల్బణాన్ని తగ్గించటానికి ఊతం ఇచ్చేందుకు రెపో రేటును అమాతం 40 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. భారత్ ఇంధన అవసరాల్లో 85 శాతం దిగుమతుల వల్లే తీరుతున్నాయి. ఇంధనంపై టాక్స్ రూపంలో కేంద్రానికి దాదాపు రూ.3 లక్షల కోట్లు ఆర్జిస్తోంది.
అంతర్జాతీయంగా ధరలు తగ్గుదలకు అనుకూలంగా అయితే మన దగ్గర రేట్లను ప్రభుత్వాలు తగ్గించటం లేదు. అయితే ఈ ఏడాది చివరిలో ప్రధాని మోది సొంత రాష్ట్రమైన గుజరాత్ ఎన్నికలు రావటం.. ఆ తరువాత సార్వత్రిక ఎన్నికలు కూడా ఉండటంతో ప్రజలను ఏమార్చేందుకు ఈ నిర్ణయం తీసుకన్నారంటూ పొలిటికల్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. కానీ.. ప్రస్తుతం ఇంధనం నుంచి వస్తున్న ఆదాయాన్ని కోల్పోతున్న కేంద్రం.. దీనిని భర్తీ చేసుకునేందుకు ఇతర పన్నులను పెంచుతుందా లేక కొత్త సెజ్ లను, పన్నులను ప్రవేశ పెడుతుందా అనే అనుమానాలు సైతం సామాన్యుల్లో వ్యక్తం అవుతున్నాయి. ఇలా ఇచ్చినట్లే ఇచ్చి మరో దారిలో ఆ మెుత్తాన్ని ప్రజల నుంచి కేంద్రం వసూలు చేస్తుందేమోనని వారు అంటున్నారు. ఏదేమైనా బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లోని ప్రజలకు ఈ తగ్గింపు ఎంత వరకు అక్కడి ప్రభుత్వాలు అందిస్తాయో వేచి చూడాల్సిందే. కేంద్రం నష్టపోతున్నప్పటికీ.. సంచలన నిర్ణయం తీసుకోవటానికి వెనుక ఉన్న అసలు మ్యాటర్ ఏమిటో త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ చమురు కంపెనీలకు మాత్రం ఈ నిర్ణయం వల్ల ఎలాంటి నష్టం ఉందని తెలుస్తోంది.