Onion Prices: అప్పుడు ప్రజలు.. ఇప్పుడు రైతన్నలు.. లబోదిబోమంటున్న ఉల్లి రైతులు.. కారణం ఏంటంటే..!

|

May 31, 2022 | 9:16 PM

Onion Prices: దేశంలో ఒకవైపు సామాన్య ప్రజానీకం ద్రవ్యోల్బణం మంటల్లో మండిపోతోంది. మరోవైపు రైతులు మాత్రం భిన్నమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇందుకు కారణం..

Onion Prices: అప్పుడు ప్రజలు.. ఇప్పుడు రైతన్నలు.. లబోదిబోమంటున్న ఉల్లి రైతులు.. కారణం ఏంటంటే..!
Follow us on

Onion Prices: దేశంలో ఒకవైపు సామాన్య ప్రజానీకం ద్రవ్యోల్బణం మంటల్లో మండిపోతోంది. మరోవైపు రైతులు మాత్రం భిన్నమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇందుకు కారణం నిరంతరం తగ్గుతున్న ఉల్లి ధరలే సమస్య. ఇంతకుముందు ఉల్లి ప్రజలను ఏడిపించింది. ఇప్పుడు రైతులను ఏడిపిస్తోంది. గతంలో కిలో ఉల్లి ధర రూ.30 నుంచి 35 ఉండగా, ప్రస్తుతం పలు మండీల్లో కిలో ఉల్లి ధర రూ.7 నుంచి రూ.8కే పలుకుతున్న పరిస్థితి నెలకొంది. ఉల్లి ధరలు పడిపోవడంతో రైతులు వీధిన పడాల్సి వస్తోంది. రైతులు ఉద్యమాన్ని ప్రారంభించారు. వేలాది మంది రైతులు వీధిన పడ్డారు.

నాసిక్ మార్కెట్‌లో ఉల్లి ధర పూర్తిగా పడిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. ఉల్లి ధర పతనానికి నిరసనగా రైతులు నాసిక్ జిల్లా యోలా పట్టణంలోని ప్రాంతీయ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక్కడ సెలూన్‌లో ఉన్నవారు 10 ఏళ్ల క్రితం హెయిర్‌ కటింగ్‌కు ఎంత మొత్తంలో ఇస్తున్నారో అదే మొత్తంలో చెల్లిస్తున్నారా అని రైతులు ప్రశ్నించారు. అయితే రైతులు పండించిన పంటకు పదేళ్ల క్రితం ఎంత ధర లభిస్తుందో అదే ధర లభిస్తోంది. గత కొన్నేళ్లుగా అకాల వర్షాలు, పురుగుమందులు, ఎరువుల ధరలు పెరగడంతో రైతన్నల కష్టాలు పెరిగిపోయాయని రైతులు అంటున్నారు.

పెట్టిన ఖర్చు రావడం లేదు

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం కిలో ఉల్లిని రూ.7 నుంచి 8 వరకు విక్రయిస్తున్నట్లు రైతులు తెలిపారు. కాగా ఉత్పత్తి వ్యయం ఇప్పటికే కిలో రూ.20 దాటింది. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ధరల వల్ల నష్టాన్ని భర్తీ చేయాలని రైతులు అంటున్నారు. ప్రభుత్వం వారికి నష్టపరిహారం చెల్లించాలి. ఉల్లి, కనీస విక్రయ ధరపై దిగుమతి విధానాన్ని తీసుకురావాలని రైతులు డిమాండ్‌ చేశారు. నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్) విధానాలపై కూడా రైతులు ప్రశ్నలు సంధించారు. రైతుల అభిప్రాయం ప్రకారం.. నాఫెడ్ కోసం ఉల్లిని కొనుగోలు రేటు నిర్ణయించే వారికి గ్రౌండ్ రియాలిటీ గురించి తెలియదు. దీంతో కేంద్ర ఏజెన్సీ తక్కువ ధరకు ఉల్లిని కొనుగోలు చేస్తోంది.

ఇక్కడ షోలాపూర్ రైతులు కూడా ఇదే ఫిర్యాదు చేస్తున్నారు. షోలాపూర్ వ్యవసాయోత్పత్తుల మార్కెట్ కమిటీకి చేరుకున్న రైతులంతా ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆందోళనకు దిగారు. ఉల్లి లావాదేవీల్లో ఉత్పత్తి ఖర్చు కూడా రావడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూణేకు 250 కిలోమీటర్ల దూరంలోని అంజన్‌గావ్‌కు చెందిన ఓంకార్ పటేకర్ అనే రైతు తన వద్ద 40 బస్తాల ఉల్లిపాయలు విక్రయించడానికి ఉన్నాయని, ధరలేక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.

ఉల్లిగడ్డలు కిలోకు రూ.9-11 వరకు లభిస్తోందని పుణె వ్యవసాయోత్పత్తి మార్కెట్ కమిటీ అధికారులు చెబుతున్నారు. పుణె ఏపీఎంసీ అధికారి మధుకాంత్ గరద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది దిగుబడి బాగానే వచ్చినా రైతులకు నిల్వ పెట్టుకునే వెసులుబాటు లేదు. రుతుపవనాలు సమీపిస్తున్నందున రైతులు తమ పంటను వేగవంతంగా విక్రయిస్తున్నారు. దీంతో ధర పతనానికి దారితీసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి