Car: పెట్రోల్‌, డీజీల్‌.. ఏ కారు కొనుగోలు చేయాలో తెలియక కన్ఫ్యూజ్‌ అవుతున్నారా.?

అయితే పెట్రోల్, డీజీల్‌ ఇలా వేరియంట్స్‌కు వాటి వాటి ప్రత్యేకతలు ఉంటాయి. పెట్రోల్‌తో పోల్చితే డీజిల్‌ తక్కువ ధర కావడంతో ఎక్కువ మంది డీజీల్‌ కార్లకు ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే పెట్రోల్ వేరియంట్‌ కార్ల ద్వారా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పెట్రోల్ కార్లలో ఉండే అలాంటి కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లకు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Car: పెట్రోల్‌, డీజీల్‌.. ఏ కారు కొనుగోలు చేయాలో తెలియక కన్ఫ్యూజ్‌ అవుతున్నారా.?
Petorl Vs Diesel

Updated on: Jun 23, 2024 | 1:49 PM

ప్రస్తుతం దేశంలో కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఒకప్పుడు కేవలం ఉన్నత కుటుంబాలకు చెందిన వారు మాత్రమే కార్లను కొనుగోలు చేసేవారు. కానీ ప్రస్తుతం మధ్య తరగతి కుటుంబాలు కూడా కార్లను ఉపయోగిస్తున్నారు. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత సొంత కార్లకు ప్రాధాన్యత ఇచ్చే వారి సంఖ్య క్రమంగా పెరిగింది. అయితే కారు కొనుగోలు చేసే సమయంలో చాలా ఫ్యూయల్ వేరియంట్ గురించి కన్ఫ్యూజ్‌ అవుతుంటారు. పెట్రోల్ వేరియంట్‌ కొనాలా.? డీజీల్‌ వేరియంట్ కొనాలా తెలియక తికమకపడుతుంటారు.

అయితే పెట్రోల్, డీజీల్‌ ఇలా వేరియంట్స్‌కు వాటి వాటి ప్రత్యేకతలు ఉంటాయి. పెట్రోల్‌తో పోల్చితే డీజిల్‌ తక్కువ ధర కావడంతో ఎక్కువ మంది డీజీల్‌ కార్లకు ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే పెట్రోల్ వేరియంట్‌ కార్ల ద్వారా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పెట్రోల్ కార్లలో ఉండే అలాంటి కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లకు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ధర విషయానికొస్తే డీజిల్‌ కార్లతో పోల్చితే పెట్రోల్‌ కార్లు చౌకగా ఉంటాయి. ఒకవేళ మీ బడ్జెట్ తక్కువ అయితే పెట్రోల్‌ కారును ఎంపిక చేసుకోవడం బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇక పెట్రోల్‌ వాహనాలు డిజైన్‌ పరంగా చూస్తే సింపుల్‌గా ఉంటాయి. వీటి నిర్వహణ వ్యయం కూడా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కారు విడి భాగాలు కూడా మార్కెట్‌లో సులభంగా లభిస్తాయి. అలాగే రెగ్యులర్‌గా చేసే సర్వీసింగ్ కూడా తక్కువ ఖర్చుతో పూర్తవుతుంది.

పెట్రోల్‌ ఇంజన్‌, డీజిల్‌ ఇంజన్‌తో పోల్చితే స్మూత్‌గా ఉంటుంది. డీజిల్‌ ఇంజన్‌ కంటే పెట్రోల్ ఇంజన్‌ తక్కువ శబ్ధం చేస్తుంది, తక్కువ వైబ్రేషన్‌ కలిగి ఉంటుంది. ఇది మీ డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి పెట్రోల్‌ వేరియంట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మెలైజీ పరంగా చూస్తే పట్టణ ప్రాంతాల్లో పెట్రోల్ కార్లు మంచి మైలేజీని ఇస్తాయి. అయితే లాంగ్‌ జర్నీలకు మాత్రం డీజిల్ కార్లు బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. రీసేల్ వ్యాల్యు విషయంలో కూడా పెట్రోల్‌ కార్లు బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. పెట్రోల్‌ వెర్షన్‌ కార్లకు రీసేల్‌ వాల్యూ ఎక్కువగా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..