Wheat Price Increase: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గోధుమలను దిగుమతి చేసుకుంటుందన్న వార్తలను కొట్టిపారేసినప్పటికీ.. దేశీయ మార్కెట్‌లో గోధుమల ఉత్పత్తి తగ్గిన తర్వాత మళ్లీ ధరలు పెరిగాయి. పండుగల సీజన్ వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో గోధుమ ధరలకు మళ్లీ రెక్కలొస్తున్నాయి. పండుగల సీజన్‌లో గోధుమలకు డిమాండ్ పెరుగుతుంది. అయితే గత వారం రోజులుగా గోధుమల ధరలు 4 శాతం మేర పెరిగాయి. డిమాండ్ పెరగడం వల్ల గోధుమల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం గోధుమల దిగుమతిని నిరాకరిస్తోంది. అదేవిధంగా గోధుమల దిగుమతిపై దిగుమతి సుంకాన్ని తగ్గించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. కానీ ప్రభుత్వం వెంటనే ఈ నివేదికలను ఖండించింది. గోధుమలను దిగుమతి చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేస్తోంది.
గోధుమ ఉత్పత్తిలో తగ్గింపు:
ఇటీవల వ్యవసాయ మంత్రిత్వ శాఖ గోధుమ ఉత్పత్తికి సంబంధించి నివేదికలు విడుదల చేసింది. 2021-22లో 106.84 మిలియన్ టన్నుల గోధుమల ఉత్పత్తిని అంచనా వేసింది. ఇది మునుపటి అంచనా 111 మిలియన్ టన్నుల కంటే తక్కువగా ఉంది. పార్లమెంటు వర్షాకాల సమావేశంలో వ్యవసాయ మంత్రి మాట్లాడుతూ, జూలై 1, 2022 వరకు ప్రభుత్వం వద్ద 285.10 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమ స్టాక్ ఉందని, ఇది బఫర్ స్టాక్ పరిమితి 275.80 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ అని తెలిపింది. ప్రయివేటు వ్యాపారులు భారీగా కొనుగోళ్లు చేయడంతో ప్రభుత్వ గోధుమల కొనుగోళ్లు తగ్గాయని భావిస్తున్నారు.
గోధుమల ఎగుమతిపై నిషేధం..
గతంలో మే నెలలో గోధుమల ఉత్పత్తి తగ్గడంతో ప్రభుత్వం గోధుమల ఎగుమతిపై నిషేధం విధించింది. తద్వారా దేశీయ మార్కెట్‌లో పెరుగుతున్న ధరలను నియంత్రించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి