WhatsApp Feature Update: వాట్సాప్ కొత్త ఫీచర్ అప్‎డేట్.. ఆ సమయాన్ని పెంచుతారటా..

|

Nov 02, 2021 | 4:51 PM

వాట్సాప్ 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్' టైమ్ లిమిట్‎ను పొడిగించే పనిలో ఉన్నట్లు సమాచారం. వాట్సాప్‎లో మెసేజ్ డిలీట్ ఫీచర్‎ను 2017లో ప్రవేశపెట్టారు. 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్' ఫీచర్ కాలపరిమితి ఏడు నిమిషాలుగా నిర్ణయించారు. కొన్ని నెలల తర్వాత గంటకు పైగా పెంచారు...

WhatsApp Feature Update: వాట్సాప్ కొత్త ఫీచర్ అప్‎డేట్.. ఆ సమయాన్ని పెంచుతారటా..
Whatsup
Follow us on

వాట్సాప్ ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ టైమ్ లిమిట్‎ను పొడిగించే పనిలో ఉన్నట్లు సమాచారం. వాట్సాప్‎లో మెసేజ్ డిలీట్ ఫీచర్‎ను 2017లో ప్రవేశపెట్టారు. ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ ఫీచర్ కాలపరిమితి ఏడు నిమిషాలుగా నిర్ణయించారు. కొన్ని నెలల తర్వాత గంటకు పైగా పెంచారు. అంటే మనం వాట్సాప్‎లో ఏదైనా అనుకోకుండా మెసేజ్ పెట్టామనుకోండి. దాన్ని డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అప్షన్ క్లిక్ చేస్తే ఆ మెసేజ్ అందరి వాట్సాప్‎లో డిలీట్ అవుతుంది. ఫేస్‎బుక్(మెటా) ఇన్‎స్టాగ్రామ్, యూట్యూబ్, మరిన్ని ప్లాట్‌ఫారమ్‌ల్లో వీడియో షేర్ చేయడానికి iOS డివైస్ కోసం కొత్త వీడియో ప్లేబ్యాక్ ఇంటర్‌ఫేస్‌ను విడుదల చేయాలని చూస్తోందని ఓ నివేదిక సూచించింది.

వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా v2.21.23.1 వర్షన్‎లో ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ ఫీచర్ కాలపరిమితిని 4,096 సెకన్ల నుండి నిరవధిక కాలానికి పెంచవచ్చని నివేదించింది. ఈ ఫీచర్ ఇంకా అభివృద్ధిలో ఉంది. సందేశం తొలగించబడిన తర్వాత, అది చాట్ విండోలో ఈ సందేశం తొలగించబడిందని తెలిపే నోటిఫికేషన్ వస్తుందని తెలిపింది. WABetaInfo యొక్క మరొక నివేదిక iOSలో WhatsApp కొత్త వీడియో ప్లేబ్యాక్ ఇంటర్‌ఫేస్‌ను వస్తుందని పేర్కొంది. ఇది పాస్ చేయడానికి, వీడియోను పూర్తి స్క్రీన్‌లో ప్లే చేయడానికి లేదా పిక్చర్-ఇన్-పిక్చర్ విండోను మూసివేయడానికి ఉపయోగపడుతుంది. గత నెల చివరిలో Android పరికరాల కోసం బీటా వెర్షన్‌లో ప్రవేశపెట్టారు. కొంతమంది iOS బీటా టెస్టర్లు WhatsAppలో YouTube వీడియోలను ప్లే చేసే విధానంలో మార్పును గమనించవచ్చని నివేదికలో ప్రస్తావించింది.

Read Also.. Post Office Scheme: పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌.. ఇందులో చేరి ఇన్వెస్ట్ చేస్తే రూ.14 లక్షల బెనిఫిట్‌.. పూర్తి వివరాలు..!