PAN Card: పాన్ కార్డు నెంబర్లో టాప్ సీక్రెట్! ఆ 10 డిజిట్స్ వెనుక ఏముందంటే..

పర్మినెంట్ అకౌంట్ నంబర్ అంటే ఏ వ్యక్తికైనా ఒకటే ఉంటుంది. పాన్‌ను రెండుసార్లు ఇవ్వరు. పాన్ కార్డ్‌పై ముద్రించిన నంబర్ శాశ్వతంగా ఉండిపోతుంది. దానిని మార్చడం సాధ్యం కాదు. వాస్తవానికి, పాన్ కార్డును జారీ చేసే ఆదాయపు పన్ను శాఖ పాన్ నంబర్ ఇవ్వడానికి ప్రత్యేక విధానాన్ని అవలంబిస్తుంది. దీని కింద మీకు 10 అంకెల సంఖ్య కేటాయిస్తుంది. ఈ 10 అంకెల పాన్‌ నంబర్లో అక్షరాలు, సంఖ్యల మిశ్రమం ఉంటుంది.

PAN Card: పాన్ కార్డు నెంబర్లో టాప్ సీక్రెట్! ఆ 10 డిజిట్స్ వెనుక ఏముందంటే..
Pan Card
Follow us
Madhu

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jan 14, 2024 | 8:33 PM

మన దేశంలో అత్యంత ముఖ్యమైన పత్రాలలో పాన్ కార్డ్ ఒకటి. ఉద్యోగం నుంచి బ్యాంకు వరకు, పోస్టాఫీసు నుంచి విద్య వరకు, అన్ని చోట్లా పాన్ కార్డ్ ఉపయోగపడుతుంది. దీనినే పర్మినెంట్ అకౌంట్ నంబర్ (శాశ్వత ఖాతా సంఖ్య) అని కూడా అంటారు. పాన్ కార్డ్ అనేది ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన ఒక ప్రత్యేకమైన 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ నంబర్. ఈ పాన్ కార్డు సాధారణంగా లామినేటెడ్ ప్లాస్టిక్ కార్డ్ రూపంలో జారీ అవుతుంది. ఆ కార్డు దిగువన 10 అంకెలు మీకు కనిపిస్తాయి. అందులో మీ వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు. అవునండి ఇది ఆ సంఖ్యల సాక్షిగా నిజం. ఆ పది సంఖ్యల్లోనే మీ వివరాలు హిడెన్ అయి ఉంటాయి. అదెలా తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ కథనం చివరి వరకూ చదవండి. పాన్ కార్డ్‌లో రాసిన 10 నంబర్ల అర్థం ఏమిటో? పాన్ నంబర్ ద్వారా ఎలాంటి సమాచారాన్ని పొందవచ్చో తెలుసుకోండి.

ఒకేసారి ఇస్తారు..

పర్మినెంట్ అకౌంట్ నంబర్ అంటే ఏ వ్యక్తికైనా ఒకటే ఉంటుంది. పాన్‌ను రెండుసార్లు ఇవ్వరు. పాన్ కార్డ్‌పై ముద్రించిన నంబర్ శాశ్వతంగా ఉండిపోతుంది. దానిని మార్చడం సాధ్యం కాదు. వాస్తవానికి, పాన్ కార్డును జారీ చేసే ఆదాయపు పన్ను శాఖ పాన్ నంబర్ ఇవ్వడానికి ప్రత్యేక విధానాన్ని అవలంబిస్తుంది. దీని కింద మీకు 10 అంకెల సంఖ్య కేటాయిస్తుంది. ఈ 10 అంకెల పాన్‌ నంబర్లో అక్షరాలు, సంఖ్యల మిశ్రమం ఉంటుంది. పాన్ కార్డ్‌లోని మొదటి 5 అక్షరాలు ఎల్లప్పుడూ వర్ణమాలగా ఉంటాయి. తదుపరి 4 అక్షరాలు సంఖ్యలు, చివరకు ఒక వర్ణమాల తిరిగి వస్తుంది. దీనిలో ఎటువంటి సమాచారం దాగి ఉంటుంది. ఈ పది సంఖ్యల వెనుక ఉన్న రహస్యం ఏమిటి అనేది తెలుసుకోవడం అవసరం..

పాన్‌లో 10 అక్షరాల అర్థం ఏమిటంటే..

మీరు ఎప్పుడైనా మీ పాన్ కార్డ్‌ని జాగ్రత్తగా చూసినట్లయితే, పాన్ కార్డ్‌లోని మొదటి మూడు అక్షరాలు ఆల్ఫాబెటికల్ సిరీస్‌లో ఉన్నాయని మీకు తెలుస్తుంది. పాన్ నంబర్లో నాల్గవ అక్షరం ఆదాయపు పన్ను శాఖ దృష్టిలో మీరు ఏమిటో తెలియజేస్తుంది . మీరు ఒక వ్యక్తి అయితే, మీ పాన్ కార్డ్ యొక్క నాల్గో వర్ణమాల P అవుతుంది. కాబట్టి పాన్ కార్డ్ ఏ అక్షరం వెనుక ఏమి దాగి ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

పాన్ లో మొదటి 3 అక్షరాలు..

పాన్ లో మొదటి 3 అక్షరాలు అక్షర శ్రేణి రూపంలో ఉంటాయి. ఇది AAA నుంచి ZZZ రూపంలో ఉండవచ్చు.

నాల్గో అక్షరం..

పాన్‌లో నాల్గవ అక్షరం చాలా ముఖ్యమైనది. దీనిని బట్టే ఆ నంబర్ వ్యక్తిదా, సంస్థదా లేక ఏదైనా కంపెనీకి చెందినదా, ఏదైనా వ్యక్తుల సంఘానిదా, లేక ట్రస్ట్ కు సంబంధించినదా వంటి వివరాలు ఆదాయ పన్ను శాఖ తెలుసుకుంటుంది. చూడగానే అర్థమయ్యే విధంగా ఒక్కొక్కరికీ ఒక్కో ఆల్ఫాబేట్ ను కేటాయించింది.

P- ఒకే వ్యక్తి

F- సంస్థ

C- కంపెనీ

A- AOP (అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్)

T- ట్రస్ట్

H- HUF (హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ)

B- BOI (బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్)

L- లోకల్

J- ఆర్టిఫీయల్ జ్యూడిషియల్ పర్సన్ న్యాయవ్యక్తి

G- ప్రభుత్వం

పాన్ లో 5వ అక్షరం..

పాన్ కార్డ్ నంబర్‌లోని ఐదవ అక్షరం వర్ణమాల. ఈ అంకె పాన్ కార్డ్ హోల్డర్ ఇంటిపేరులోని మొదటి అక్షరం. ఇది పాన్ కార్డ్ హోల్డర్‌ ను బట్టి మారుతుంటుంది. ఇందులో హోల్డర్ ఇంటిపేరు మాత్రమే కనిపిస్తుంది.

చివరి 4 అక్షరాలు..

దీని తర్వాత పాన్ కార్డులో 4 నంబర్లు ఉంటాయి. ఈ నంబర్‌లు 0001 నుంచి 9999 వరకు ఏదైనా కావచ్చు. మీ పాన్ కార్డ్ నంబర్‌లు ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖలో అమలవుతున్న సిరీస్‌ని సూచిస్తాయి.

చివరి డిజిట్..

పాన్ దాని చివరి అంకె ఆల్ఫాబెట్ చెక్ డిజిట్, ఇది ఏదైనా అక్షరం కావచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.