మనీలాండరింగ్ అనే పదాన్ని చాలా సార్లు వినే ఉంటారు. కొంత మందికి దీని గురించి తెలిసి ఉంటుంది. మరికొందరికి తెలిసి ఉండదు. అసలు మనీలాండరింగ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. బ్లాక్ మనీని వైట్ మనిగా మార్చే ప్రక్రియను మనీలాండరింగ్ అంటారు. అక్రమ దారుల గుండా సంపాదించిన లేదా ఆదాయానికి మించి సమకూర్చిన సంపాదనను బ్లాక్ మనీ అంటారు. అయితే ఈ మనీల్యాండరింగ్ అనేది మూడు దశలో జరుగుతుంది. వాటిలో 1)ప్లేస్‌మెంట్, 2) లేయరింగ్ 3)ఇంటిగ్రేషన్. అయితే ఈ మనీలాండరింగ్, హవాలా అంటే ఏమిటి? వీటి మధ్య తేడా ఏమిటో తెలుసుకుందాం.
ఇక ‘హవాలా’ అనే పదాన్ని కూడా విని ఉంటారు. దీనికి అర్థం ఏంటో తెలుసుకుందాం. బదిలీ లేదా హండి అని కూడా అంటారు. స్థానికంగా, అంతర్జాతీయంగా అనక ప్రాంతాల్లో సాధారణంగా ఉపయోగించే అనధికారిక నిధుల బదిలీ సిస్టమ్‌లో ఇదొకటని చెప్పాలి. డబ్బును ఒక దేశంలో హవాలాదారులు ప్రపంచమంతా చాలా మంది ఉన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థకు సమాంతరంగా ప్రజలు ఈ అనధికార, సంప్రదాయ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. దీనిలోని మధ్యవర్తులను హవాలాదార్‌లని పిలుస్తారు. వీరిపై ఉండే నమ్మకంపై ఆధారపడి ఈ మొత్తం వ్యవస్థ కొనసాగుతుంది.
అసలు ఎవరు తీసుకుంటున్నారో.. ఎవరు ఇస్తున్నారో.. తెలుసుకోకుండానే కోట్ల రూపాయలు హవాలా మార్గంలో బదిలీ చేయవచ్చు. సాధారణంగా మధ్యవర్తులు ఎలాంటి రికార్డుల్లోనూ లావాదేవీలు నమోదు చేయరు. అసలు ఈ డబ్బును ఎవరు పంపారో? ఎవరికి పంపారో తెలుసుకోవడంలో ఇదే అతిపెద్ద సమస్య. కొన్నిసార్లు ఈ డబ్బును అక్రమ నగదు లావాదేవీలకు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు, ఉగ్రవాద సంస్థల ప్రోత్సాహానికీ వాడుకుంటున్నట్లు ఆరోపణలు కూడా వస్తుంటాయి.
ఈ హవాలా నెట్‌వర్క్ ఎలా పని చేస్తుందో ఉదాహణ ద్వారా తెలుసుకుందాం. న్యూయార్క్‌లోని వ్యక్తికి పాకిస్తాన్ నుంచి డబ్బులు పంపాలంటే.. ఎలాంటి బ్యాంక్ ఖాతా అవసరం లేకుండానే ఈ విధానంలో డబ్బులు పంపవచ్చు. ఇలా చేయాలంటే ముందుగా మనం పాకిస్తాన్ వాలాదార్‌ను కలవాలి. ఇందులో ఎలాంటి బ్యాంక్ అకౌంట్ అవసరం లేకుండా ఈ విధానంలో డబ్బులు పంపవచ్చు. ఇందుకు పాకిస్తాన్ లోని హవాలాదార్ కొంత కమిషన్ తీసుకుని ఈ డబ్బులు పంపే ఏర్పాట్లు చేస్తారు. చైనాలోని ఉన్న హవాలాదార్‌కు డబ్బులు ఇచ్చిన వెంబడే అతడు.. ఓ పాస్‌వర్డ్‌ను చెబుతాడు. ఇప్పుడు ఆ డబ్బును తీసుకోవాలని అనుకునేవారు అదే పాస్‌వర్డ్‌ను రెండో హవాలాదార్‌కు చెప్పాలి. డబ్బులు తీసుకునే వ్యక్తి చెబుతున్న పాస్‌వర్డ్ సరైనదో కాదో రెండో హవాలాదార్ చూసుకుంటాడు. అలా అన్ని చెక్ చేసిన తర్వాత గంటల్లోనే రెండో వ్యక్తి చేతిలోకి డబ్బులు వెళ్లిపోతాయి. డబ్బులు చేతులు మార్చినందుకు ఇద్దరు హవాలాదార్‌లు స్పల్ప మొత్తంలో కమీషన్ తీసుకుంటారు. ఈ విధంగా హవాలా నెట్‌వర్క్ కొనసాగుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి