ఇండియాలో కొత్త ట్రెండ్‌.. పెళ్లికి ఇన్సూరెన్స్‌! చేసిన ఖర్చు మొత్తం తిరిగి క్లైయిమ్‌ చేసుకోవచ్చు!

పెళ్లిళ్లు ఇప్పుడు స్టేటస్ సింబల్స్‌గా మారి భారీ ఖర్చులతో కూడుకున్నవి. ఊహించని కారణాల వల్ల పెళ్లి రద్దయితే, కోట్లు ఖర్చులు వృథా అవుతాయి. ఈ నష్టాన్ని నివారించడానికి 'వెడ్డింగ్ ఇన్సూరెన్స్' ఇండియాలో కొత్త ట్రెండ్‌గా మారింది. ఇది మీ పెళ్లి బడ్జెట్‌ను రక్షించి, అనుకోని పరిస్థితుల్లో ఆర్థిక భద్రతను అందిస్తుంది.

ఇండియాలో కొత్త ట్రెండ్‌.. పెళ్లికి ఇన్సూరెన్స్‌! చేసిన ఖర్చు మొత్తం తిరిగి క్లైయిమ్‌ చేసుకోవచ్చు!
Wedding Insurance

Updated on: Nov 27, 2025 | 4:35 PM

లైఫ్‌ ఇన్సూరెన్స్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌, ప్రాపర్టీ ఇన్సూరెన్స్‌, వెహికల్‌ ఇన్సూరెన్స్‌.. వీటి గురించి దాదాపు ప్రతి ఒక్కరు వినే ఉంటారు. కానీ కొత్తగా వెడ్డింగ్‌ ఇన్సూరెన్స్‌ అనే ట్రెండ్‌ ఇండియాలో మొదలైంది. పెళ్లికి ఇన్సూరెన్స్‌ ఏంటి? అని ఆలోచిస్తున్నారా? ప్రస్తుతం పరిస్థితుల అలా మరిపోయాయి మరి. గతంలో పెళ్లి అంటే రెండు వేర్వేరు జీవితాలు, కుటుంబాలు ఒక్కటయ్యే సంప్రదాయం. కానీ, ఇప్పుడు దాని నిర్వచనమే మారిపోయింది. పెళ్లి అనే సంప్రదాయాన్ని ఘనంగా, గొప్పగా చేయాలనే ముసుగులో దాన్ని స్టేటస్‌ చూపించే తంతుగా మార్చేశారు.

మధ్యతరగతి కుటుంబాల నుంచి ధనవంతుల వరకు పెళ్లిని ఎంత గ్రాండ్‌ వీలైతే అంత గ్రాండ్‌ చేయాలని చూస్తున్నారు. అందుకోసం డబ్బును వెదజల్లుతున్నారు. కొన్ని అప్పు చేసేనై సరే గొప్పగానే చేయాలనే ధోరణి కనిపిస్తోంది చాలా మంది. పెళ్లి రోజే కాకుండా, పెళ్లికి ముందు హల్దీ వేడుక, సంగీత్‌, మెహందీ ఫంక్షన్‌, పెళ్లి తర్వాత రిసెప్షన్‌ వంటి కార్యక్రమాలతో ఓ వారం రోజులు హోరెత్తిస్తున్నారు. అలాగే బారాత్‌లు, సినీ ప్రముఖలతో షోలు కూడా నిర్వహిస్తున్నారు. పెళ్లి కోసం ఇచ్చి చేస్తుండటంతో డబ్బు మంచి నీళ్లలా ఖర్చు అవుతుంది.

ఇంత గ్రాండ్‌గా పెళ్లి చేయాలంటే కొన్ని నెలల ముందు నుంచే ప్లానింగ్‌ అవసరం. పెళ్లి వేదికలను బుక్‌ చేసుకోవాలి. ఈ మధ్య డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ అంటూ ప్రపంచంలోని ప్రముఖ ప్రాంతాలకు వెళ్లి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. అలా రాజస్థాన్‌లో కోటల్లో ఎక్కువ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. మరి ఆ కోటను బుక్‌ చేసుకోవాలి, అతిథులకు, కుటుంబ సభ్యులకు ఫ్లైట్‌ టికెట్లు బుక్‌ చేయాలి, భోజనాల కోసం కాస్ట్లీ కుక్‌లను మాట్లాడుకోవాలి, క్యాటరర్స్‌కు కాంట్రాక్ట్‌ ఇవ్వాలి. కళ్లు చెదిరిపోయే డెకరేషన్‌లు, సినిమా లెవెల్‌లో సెట్టింగులు వేయాలి. పోని ఇదంతా వెడ్డింగ్‌ ప్లానర్స్‌తో చేయించాలన్నా వారికి కూడా అడ్వాన్స్‌ ఇవ్వాలి. అది కోట్లలో ఉంటుంది.

మరి ఇంతా చేసి కొన్ని అనుకోని సంఘటనల కారణంగా పెళ్లి క్యాన్సిల్‌ అయితే! కోట్ల రూపాయలు బుడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అందుకే ఇప్పుడీ వెడ్డింగ్‌ ఇన్సూరెన్స్‌ వచ్చింది. పెళ్లికి ఖర్చు చేస్తున్న బడ్జెట్‌ను బట్టి ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నారు. ఒక ఏ కారణం చేతనైనా పెళ్లి వాయిదా పడితే అప్పటి వరకు చేసిన ఖర్చుకు ఇన్సూరెన్స్‌ వస్తుందన్న మాట. కుటుంబ సభ్యులలో ఎవరైన మరణించి పెళ్లి వాయిదా పడొచ్చు, లేదా ప్రకృతి వైపరిత్యాలు సంభవించి పెళ్లి ఆగిపోవచ్చు.. ఇలా కారణం ఏదైనా పెళ్లి ఖర్చుల్లో ఇంకాస్త ఇన్సూరెన్స్‌ కోసం వెచ్చిస్తే అనుకొని పరిస్థితుల్లో అటుఇటు అయినా తమ డబ్బు సేఫ్‌ అని చాలా మంది ఆలోచిస్తున్నారు. సమీప భవిష్యత్తులో ఈ వెడ్డింగ్‌ ఇన్సూరెన్స్‌ ఇండియాలో భారీ ట్రెండ్‌గా మారే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us