Investment Plan: బీమాతో పాటు గ్యారంటీ ఇన్‌కం కావాలా..? అయితే ఈ స్కీంపై ఓ కన్నేయండి..

| Edited By: Janardhan Veluru

Mar 25, 2023 | 2:51 PM

జీవిత బీమాను, బీమాగా చూడాలా లేదా పెట్టుబడిగా చూడాలో చాలామందికి అర్థం కాదు. ఏ వ్యక్తి అయినా జీవిత బీమా పాలసీ తన జీవితంలో కలిగే ఒడిదుడుకులను ఎదుర్కొనే సమయంలో వచ్చే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు తీసుకుంటారు.

Investment Plan: బీమాతో పాటు గ్యారంటీ ఇన్‌కం కావాలా..? అయితే ఈ స్కీంపై ఓ కన్నేయండి..
Guaranteed Income Plans
Follow us on

జీవిత బీమాను, బీమాగా చూడాలా లేదా పెట్టుబడిగా చూడాలో చాలామందికి అర్థం కాదు. ఏ వ్యక్తి అయినా జీవిత బీమా పాలసీ తన జీవితంలో కలిగే ఒడిదుడుకులను ఎదుర్కొనే సమయంలో వచ్చే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు తీసుకుంటారు. అయితే చాలా మంది భవిష్యత్తు భద్రతను దృష్టిలో ఉంచుకుని పొదుపుతో పాటు గ్యారంటీ ఆదాయాన్నికోరుకుంటారు. అలాంటి వ్యక్తులు జీవిత బీమా కంపెనీల హామీతో కూడిన ఆదాయ పథకాలను (Guaranteed income plans) ఇష్టపడతారు.

గ్యారంటీ ఇన్‌కమ్ ప్లాన్ (Guaranteed income plans) పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత కస్టమర్లు ఏక మొత్తంలో లేదా నిర్ణీత వ్యవధిలో పెద్ద మొత్తాన్ని రిటర్న్ గా పొందుతారు. ఈ పథకాల్లో ముందుగా షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంటారు. పాలసీదారు కాలపరిమితిని పూర్తికాగానే, అతనికి ప్లాన్ ప్రకారం నిర్ణీత మొత్తం అందుతుంది. ఈ ఆదాయాన్ని ఏటా, త్రైమాసిక, అర్ధ సంవత్సరం లేదా నెలవారీగా పొందే వీలుంది. అటువంటి ప్రణాళికలలో, ఆదాయం మొత్తం స్థిరంగా ఉంటుంది.

ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత గ్యారెంటీ ఆదాయాన్ని కోరుకునే వారికి గ్యారెంటీ ఇన్‌కమ్ ప్లాన్ అనేది ఒక మంచిఎంపిక. అయితే చాలా మంది ఇన్సురెన్సును సంపాదన సాధనంగా చూడకూడదని అంటారు. కానీ “గ్యారంటీ ఉన్న ఆదాయ ప్రణాళికల (Guaranteed income plans) ద్వారా ఒక వ్యక్తి అవసరాలను తీరుతాయి అంటే, వారు అలాంటి పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు.

ఇవి కూడా చదవండి

గ్యారెంటీడ్ ఇన్‌కమ్ ప్లాన్‌ని ఎవరు తీసుకోవాలి ?

-మధ్యకాలిక లేదా దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టాలనుకునే వారు.

– భవిష్యత్తు భద్రత కోసం గ్యారెంటీ ఫండ్‌ను కలిగి ఉండాలన్నారు.

– మీ పెట్టుబడిపై బీమా కవరేజీని పొందాలనుకుంటున్నారు.

– మీ అవసరాలకు గ్యారెంటీ ఆదాయం కావాలకునే వారు..ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టవచ్చు..

గ్యారెంటీడ్ ఇన్‌కమ్ ప్లాన్, ప్రయోజనాలు:

-గ్యారెంటీడ్ ఇన్‌కమ్ ప్లాన్‌లలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మొదటి ప్రయోజనం ఏమిటంటే ఇది ఆదాయానికి హామీ ఇస్తుంది. ఇందులో మార్కెట్ రిస్క్ ప్రమాదం లేదు, అంటే మార్కెట్ లో అస్థిరత ఉన్నప్పటికీ మీరు స్థిరమైన ఆదాయాన్ని పొందుతారు.

– గ్యారెంటీడ్ ఇన్‌కమ్ ప్లాన్‌లు మీ ఖర్చులను తీర్చడానికి మీకు అదనపు ఆదాయం అందించడానికి ఉపయోగపడుతుంది.

– పాలసీ ప్రీమియంలను చెల్లించడానికి ఈ ఆదాయాన్ని ఉపయోగించవచ్చు.

-చెల్లించిన ప్రీమియంలు అలాగే మీరు అందుకున్న ఆదాయం కొన్ని నిబంధనలు, షరతులకు లోబడి పన్ను రహితంగా ఉండటం విశేషం.

గ్యారెంటీడ్ ఇన్‌కమ్ ప్లాన్ ఇబ్బందులు;

హామీ ఇవ్వబడిన ఆదాయ ప్రణాళిక (Guaranteed income plans) ప్రతికూలత ఏమిటంటే, ఇతర సారూప్య విధానాలతో పోలిస్తే ఉత్పత్తి , మొత్తం రాబడి సాధారణంగా తక్కువగా ఉంటుంది. ఈ పాలసీలో ఆదాయంతో పాటు బీమా కూడా అనుసంధానించబడి ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. అందువల్ల, ఆదాయంతో పాటు, ఈ ప్లాన్‌ను బీమాతో కూడా చూడాలి.Tata AIA, HDFC Life, ICICI Pru Life, Aditya Birla Sun Life వంటి సంస్థలు గ్యారంటీడ్ ఇన్‌కమ్ స్కీంలు అందిస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి