మరో 10 రోజుల్లో భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

| Edited By:

Mar 12, 2020 | 9:12 AM

ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు రికార్డు స్థాయిలో తగ్గాయి. వాటికి అనుగుణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలి. కానీ.. ఇప్పటి వరకూ పైసల్లో తప్పించి.. పెద్దగా ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అయితే ఎందుకు ఇలా జరుగుతోంది?

మరో 10 రోజుల్లో భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Follow us on

ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు రికార్డు స్థాయిలో తగ్గాయి. వాటికి అనుగుణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలి. కానీ.. ఇప్పటి వరకూ పైసల్లో తప్పించి.. పెద్దగా ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అయితే ఎందుకు ఇలా జరుగుతోంది? మన దేశంలో చమురు ఉత్పత్తుల ధరలు ఎప్పుడు తగ్గుతాయి? అనే ప్రశ్నలు వస్తున్నాయి కదా.

డిమాండ్‌కు తగ్గట్లు పెట్రోల్.. ఉత్పత్తి తగ్గించాలని ఒపెక్ దేశాల చర్చలు ఫలించలేదు. దీంతో సౌదీ ఆరామ్‌కో మార్కెట్లకు భారీగా చమురును విడుదల చేయడం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు 30 శాతానికిపైగా తగ్గాయి. దీంతో.. బ్యారెల్ ముడిచమురు ధర 35 డాలర్లకు చేరింది. ఈ ప్రభావంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలి. అయితే మన దేశానికి వచ్చేసరికి.. చమురు ఉత్పత్తుల ధరలు 15 రోజల తర్వాత సవరిస్తారు. అందుకే.. అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు తగ్గిన వెంటనే.. ఆ ప్రభావం ఉండటం లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారి ఒకరు తెలిపారు.

ఇక వచ్చే రోజుల్లో ఎంత తగ్గుతాయంటే?

పెట్రోల్, డీజిల్ ధరల్లో భారీ తగ్గుదల నమోదయ్యేందుకు మరో 10 రోజుల సమయం పట్టే అవకాశముందట. వచ్చే వారంలో వీటి ధరలు రూ.5 నుంచి రూ.6 వరకూ తగ్గొచ్చు. వీటికంటే.. ఇంకా తగ్గినా ఆశ్చర్యపోనవసరం లేదు. తాజాగా ఈ రోజు పెట్రోల్ ధరలు లీటర్ పెట్రోల్ ధర 74.56 కాగా.. లీటర్ డీజిల్ ధర రూ.68.47గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.70.29, డీజిల్ ధర రూ.63.01గా ఉంది.

కాగా.. మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే.. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా ఎక్సైజ్ సుంకాలు పెంచి తమ ఖజానా నింపుకునేందుకు ప్రయత్నించొచ్చు. ఒకవేళ సుంకాలు పెంచకపోతే మాత్రం పెట్రోలియం ఉత్పత్తులపై వినియోగదారులకు భారీగా లబ్ధి చేకూరే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read More this also: వైసీపీ ఆవిర్భావ రోజు.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్

మహిళా సీఐపై చేయి చేసుకున్న వైసీపీ నేత..

లాయర్ తల పగిలింది.. మేము ప్రాణాలతో.. వస్తామో.. రామో..

కోలీవుడ్‌లో కలకలం.. అనుష్క, రానాలకు పెద్ద చిక్కు

ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. మినిమమ్ బ్యాలెన్స్ రూల్ తొలగింపు