AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: జస్ట్‌ రూ.50 వేల పెట్టుబడి.. నెలకు లక్ష సంపాదన! సూపర్‌ బిజినెస్.. లైఫ్‌ సెట్టు!

చిన్న పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించాలనుకుంటున్నారా? యువతరం ఇష్టపడే Waffle బిజినెస్ మీకు చక్కటి అవకాశం. కేవలం రూ.50,000తో ఈ ఫుడ్ బిజినెస్ ప్రారంభించి, రోజుకు రూ.5000 వరకు సంపాదించవచ్చు. సరళమైన తయారీ విధానం, అధిక లాభాల మార్జిన్ దీని ప్రత్యేకత.

Business Ideas: జస్ట్‌ రూ.50 వేల పెట్టుబడి.. నెలకు లక్ష సంపాదన! సూపర్‌ బిజినెస్.. లైఫ్‌ సెట్టు!
Waffle
SN Pasha
|

Updated on: Oct 03, 2025 | 7:09 PM

Share

చిన్న పెట్టుబడితో చక్కటి వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నారా? ఓ మంచి బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ బిజినెస్ తక్కువ పెట్టుబడితో ప్రారంభించడం ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటంటే..? ప్రస్తుత కాలంలో యువతరం ఎక్కువగా కొత్త కొత్త రుచులను తినడానికి ఇష్టపడుతున్నారు. అలాంటి వారి కోసం ఓ మంచి ఫుడ్ బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదే Waffle బిజినెస్‌. దీని గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో యువతరం వీటిని తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. Waffle అనేది ఒక టేస్టీ డెసర్ట్ అని చెప్పవచ్చు. దీని రుచి చాలా తియ్యగా స్వీట్ లాగా ఉంటుంది. దీన్ని తయారు చేసే విధానం కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది.

పెట్టుబడి ఎంత అవుతుంది?

ఈ బిజినెస్ కోసం మీరు కనీస పెట్టుబడిగా రూ.50,000 పెట్టాలి. దీన్ని మీరు స్ట్రీట్ ఫుడ్ తరహాలో తయారు చేసుకోవచ్చు. ఫుడ్ ట్రక్ ద్వారా కూడా ఈ బిజినెస్ చేయవచ్చు. అయితే మీరు ఎంపిక చేసుకున్న లోకేషన్ కాలేజీలు, ఐటీ కంపెనీలు, స్కూల్స్, షాపింగ్ మాల్స్, పార్కులు సమీపంలో ఉన్నట్లయితే చక్కగా సేల్ అవుతుంది.

ఎలాంటి ఎక్విప్మెంట్ తీసుకోవాలి?

వాఫెల్ మేకర్ మెషిన్, మిక్సర్, మిక్సింగ్ బౌల్స్, కూలింగ్ ర్యాక్, సర్వింగ్ ప్లేట్స్ అవసరం అవుతాయి. ఇక ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు పెద్ద మొత్తంలో ఈ బిజినెస్ ప్రారంభిస్తున్నట్లయితే, ఒక షాపును రెంట్ తీసుకోవడం ద్వారా ప్రారంభించవచ్చు.

Waffle మెనూ ఎలా తయారు చేసుకోవాలి?

చాక్లెట్ వాఫెల్, స్ట్రాబెర్రీ వాఫెల్, నూటెల్లా, ఐస్‌క్రీమ్ కాంబినేషన్స్, హనీ, సావరీ వాఫెల్స్ కు మంచి డిమాండ్ ఉంటుంది. వీలైతే మీరు Waffle ఎలా తయారు చేయాలో శిక్షణ పొందడం ద్వారా మంచి ప్రావీణ్యం లభిస్తుంది. Waffle తయారీ కోసం ఆన్ లైన్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు.

వాఫెల్ మీద ఎంత లాభం వస్తుంది.

సాధారణంగా ఒక వాఫెల్ తయారీకి అయ్యే ఖర్చు సుమారు రూ.30 మాత్రమే. దీన్ని మీరు రూ.120 నుంచి రూ.150 వరకు విక్రయించుకునే అవకాశం ఉంది. అయితే ఇందులో వెరైటీని బట్టి మీ పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది. మీరు రోజుకు కనీసం 50 వాఫెల్స్ అమ్మినట్లయితే రూ.5000 వరకు సంపాదించే అవకాశం ఉంది. ఈ లెక్కన చూస్తే నెలకు కనీసం ఒక లక్ష రూపాయల వరకూ సంపాదించే అవకాశం ఉంటుంది. ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్లను పొందవచ్చు. లేదా క్యాటరింగ్ సర్వీసుల ద్వారా ఆర్డర్లను పొంది వివాహాది శుభకార్యాలలో వాఫెల్ కౌంటర్ పెట్టి చక్కటి ఆదాయం పొందవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి