Vivo Mobiles: వివో నుంచి ఎక్స్ 70 ప్రో, ఎక్స్ 70 ప్రో ప్లస్ ఫోన్లు.. ఫీచర్స్, ధర వివరాలివే..
స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో తన సరికొత్త X70 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ఇండియలో లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో వివో ఎక్స్ 70 ప్రో, ఎక్స్ 70 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది...
Vivo Mobiles: స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో తన సరికొత్త X70 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ఇండియలో లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో వివో ఎక్స్ 70 ప్రో, ఎక్స్ 70 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. రెండు స్మార్ట్‌ఫోన్‌లు జీస్ ఆప్టిక్స్, గింబాల్ కెమెరాతో తీసుకొచ్చారు. రెండు స్మార్ట్‌ఫోన్లు వివో రూపొందించిన ఇమేజింగ్ చిప్ V1తో వస్తాయి. రెండూ జీస్ టి సర్టిఫైడ్ కోటింగ్ చేశారు. ఇవి రియల్ టైమ్ ఎక్స్‌ట్రీమ్ నైట్ విజన్, సూపర్ నైట్ వీడియో, ప్యూర్ నైట్ వ్యూ, ప్రో సినిమాటిక్ మోడ్ వంటి కెమెరా ఫీచర్‌లను అందిస్తున్నాయి. భారతదేశంలో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888+ ప్రాసెసర్‌తో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ వివో ఎక్స్ 70 ప్రో+. ఈ స్మార్ట్‌ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో పని చేస్తుంది.
ధర ఎతంటే..?
మోడల్ | వేరియంట్ | ఖరీదు |
X70 ప్రో | 8GB+128GB | రూ. 46,990 |
X70 ప్రో | 8GB+256GB | 49,990 రూపాయలు |
X70 ప్రో | 12GB+256GB | 52,990 రూపాయలు |
X70 ప్రో ప్లస్ | 12GB+256GB | రూ. 79,990 |
వివో ఎక్స్ 70 ప్రో+ ధర రూ. 79,990 గా ఉంది. వివో X70 ప్రో మూడు వేరియంట్లలో వస్తోంది 8GB+128GBకి రూ. 46,990, 8GB+256GBకి రూ .49,990, 12GB+256GBకి రూ.52,990లకు అందుబాటులో ఉంది. కస్టమర్లు వివో ఎక్స్ 70 ప్రో+ ని ఎంజిమా బ్లాక్ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు. కానీ ఎక్స్ 70 ప్రో అరోరా డాన్, కాస్మిక్ బ్లాక్ కలర్‌తో లభ్యమవుతుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ఈరోజు నుండి ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. Flipkart, vivo.com లో ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. X70 ప్రో+ అక్టోబర్ 13 న విక్రయించనున్నారు. X70 ప్రోను మాత్రం అక్టోబర్ 7 నుంచి కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్లలో భాగంగా, కంపెనీ స్మార్ట్‌ఫోన్‌లతో రూ. 5000 వరకు క్యాష్‌బ్యాక్, ఒక సంవత్సరం స్క్రీన్ రీప్లేస్‌మెంట్ వారంటీ ఇస్తోంది.
వివో X70 ప్రో+ ఫీచర్లివే..
వివో ఎక్స్ 70 ప్రో+ 6.78-అంగుళాల క్వాడ్ హెచ్‌డి+ డిస్‌ప్లే, 1440×3200 పిక్సెల్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888+ ప్రాసెసర్‌తో పాటు 12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పనిచేస్తుంది. హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది, స్మార్ట్‌ఫోన్ జీస్ ఆప్టిక్స్‌తో కూడిన గింబల్ కెమెరాతో వస్తుంది. వివో X70 ప్రో+ స్పోర్ట్స్ క్వాడ్ వెనుక కెమెరా 50MP, 48MP అల్ట్రా-వైడ్ కెమెరా, 4-యాక్సిస్ OIS గింబల్ స్టెబిలైజేషన్, 12MP పోర్ట్రెయిట్ కెమెరా, 8MP పెరిస్కోప్ కెమెరాతోపాటు ఫ్రంట్ . 32MP కెమెరా ఉంది.
స్మార్ట్‌ఫోన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్లు, 55W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్, 10W వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4500mAh బ్యాటరీ సామార్థ్యం కలిగి ఉంది.
వివో ఎక్స్ 70 ప్రో.. ఫీచర్లివే..
వివో ఎక్స్ 70 ప్రో 8 జిబి/12 జిబి ర్యామ్‌తో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. 6.56-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది కూడా ఒక గింబల్ కెమెరాతో వస్తుంది. వివో ఎక్స్ 70 ప్రో క్వాడ్-రియర్ కెమెరా 50MPతో ఉంది. అల్ట్రా-సెన్సింగ్ గింబల్ కెమెరా, గింబల్ స్టెబిలైజేషన్ 3.0 టెక్నాలజీ, 12MP 116 ° అల్ట్రా-వైడ్ లెన్స్ , 12MP పోర్ట్రెయిట్ కెమెరా, 8MP 5X పెరిస్కోప్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 32MPతో ఉంది.
ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 44W ఫాస్ట్ ఛార్జింగ్, 4450mAh బ్యాటరీ సామార్థ్యం కలిగి ఉంది.
Read Also.. Health Insurance: మీకు తెలుసా? డెంగ్యూ వ్యాధికి కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది..ఎలా అంటే..